Begin typing your search above and press return to search.

RC 16- మీర్జాపూర్ స్టార్ దిగాడుగా..

అయితే ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే దివ్వేందు ఇప్పుడు ‘RC 16’ తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.

By:  Tupaki Desk   |   30 Nov 2024 6:28 AM GMT
RC 16-  మీర్జాపూర్ స్టార్ దిగాడుగా..
X

అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సిరీస్ తెలుగు వెర్షన్ లో సంభాషణలు కాస్తా శృతి మించి ఉన్న కూడా ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. అమెజాన్ ప్రైమ్ లో అత్యధిక వ్యూవర్ షిప్ సొంతం చేసుకున్న ఇండియన్ వెబ్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ రెండు సీజన్స్ గా వచ్చింది. ఈ రెండింటికి మంచి ఆదరణ లభించింది.

ఇందులో లీడ్ యాక్టర్స్ లలో ఒకడిగా దివ్వేందు శర్మ నటించారు. పూల్ చంద్ త్రిపాఠి పాత్రలో అతను కనిపించాడు. ఈ పాత్ర చాలా వెరైటీగా ఉంటుంది. సిరీస్ లో ఈ క్యారెక్టర్ ఎక్కువ బూతులు మాట్లాడుతుంది. గ్యాంగ్ స్టార్ గా తనకి నచ్చినట్లు బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ పాత్రలో నటించిన దివ్వేందు శర్మకి మంచి గుర్తింపు వచ్చింది. 2007లో ‘ఆజ్ నాచలే’ సినిమాతో ఇతను నటుడిగా బాలీవుడ్ లో కెరియర్ స్టార్ట్ చేశాడు.

అయితే ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే దివ్వేందు ఇప్పుడు ‘RC 16’ తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ మైసూర్ లో జరుగుతోంది. తాజాగా ఆయన షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. దివ్వేందు ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేసి అతను ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు.

చారల షర్టు, గెడ్డంతో మాస్ అప్పీల్ తోనే అతని లుక్ ఈ చిత్రంలో ఉన్నట్లు పోస్టర్ బట్టి అర్ధమవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ‘RC 16’ మూవీ తెరకెక్కుతోన్న నేపథ్యంలో కచ్చితంగా బాలీవుడ్ లో ఎంతో కొంత అతని ఇంపాక్ట్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. సినిమాపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వచ్చే ఏడాది ఆఖరులో ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.