Begin typing your search above and press return to search.

ర్యాంప్ వాక్ ని రాత్రి పూట ప్రాక్టీస్ చేసిన బ్యూటీ!

మిస్ యూనివ‌ర్శ్ లే ఇప్పుడు సినిమా హీరోయిన్ల‌గా ప్ర‌మోట్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Sep 2024 6:30 AM GMT
ర్యాంప్ వాక్ ని రాత్రి పూట ప్రాక్టీస్ చేసిన బ్యూటీ!
X

మిస్ యూనివ‌ర్శ్ లే ఇప్పుడు సినిమా హీరోయిన్ల‌గా ప్ర‌మోట్ అవుతున్నారు. ఈ లిస్ట్ లో ఎక్కువ‌గా నార్త్ నుంచి వ‌చ్చే బ్యూటీలే ఉంటారు. సౌత్ బ్యూటీల‌కు భిన్నంగా వాళ్ల కెరీర్ జ‌ర్నీ ఉంటుంది. తాజాగా మిస్ యూనివ‌ర్శ్ 2024 పోటీల్లో కిరీటాన్ని సొంతం చేసుకుంది రియా సింఘా. గ్లోబ‌ల్ మిస్ యూనిర్శ్ గా భార‌త్ త‌రుపున ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. ఈ సంద‌ర్భంగా అమ్మ‌డు కెరీర్ జ‌ర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చింది. `కిరీటాన్ని సొంతం చేసుకోవ‌డం సంతోషంగా ఉంది.

వేదిక‌పై నాపేరు ప్ర‌క‌టించిన క్ష‌ణాలు ఇంకానా క‌ళ్ల ముందు క‌ద‌లాడుతున్నాయి. 15 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే మిస్ యూనివ‌ర్స్ అవ్వాల‌ని క‌లలు క‌న్నా. స్కూల్ నుంచి ఇంటికి రాగానే వెంట‌నే ప్రాక్టీస్ మొద‌లు పెట్టేదాన్ని. మా నాన్న నా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఆయ‌న ప్రోత్సాహం వ‌ల్లే ఇదంతా సాధ్యమైంది. వేదిక‌పై ఎలా న‌డవాలి? ఎలా మాట్లాడాలి? అని ఎన్నో రాత్రుళ్లు ప్రాక్టీ స్ చేసాను. ఏప‌నైనా ఇష్టంగా చేస్తే అది క‌ష్టంగా అనిపించ‌దు.

ఒక ప్ర‌వాహంలా వెళ్తుంది. ఇదంతా నాకు ఓక‌ల‌లా అనిపిస్తుంది. పోటీల్లో గెల‌వ‌డం క‌ష్టం అనిపించింది. భ‌యం కూడా వేసింది. కానీ గ‌త విజేత‌ల స్పూర్తితో ముందుకెళ్లాను. ఈపోటీలు లుక్స్, అందంపై మాత్ర‌మే ఆధార‌ప‌డ‌వు. ఎన్నో విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. మెక్సికోలో జ‌రిగే మిస్ యూనివ‌ర్స్ కోసం రెడీ అవుతున్నాను. నా మొద‌టి రోల్ మోడ‌ల్ మానాన్న‌. నాకు ఈపోటీ గురించి ఏం తెలియ‌న‌ప్పుడే? నాలో స్పూర్తిని నింపారు.

ఒడిదుడుకుల్లో నాకు కుటుంబం ఎంతో అండ‌గా నిల‌బ‌డింది` అనితెలిపింది. రియా సింఘా గుజ‌రాత్ కిచెందిన అమ్మాయి. అమ్మ‌డు 18 ఏళ్ల‌కే టైటిల్ గెలుచుకుంది. పైన‌ల్స్లో 51 మందితో పోటీ ప‌డి విజేత‌గా నిలిచింది. త్వ‌ర‌లో మెక్సికో పోటీల్లో పాల్గొంటుంది. అమ్మ‌డు అక్క‌డా విజ‌యం సాధిస్తే సినిమా అవ‌కాశాలు ఖాయ‌మే.