మహేష్‌తో ఛాన్స్ మిస్.. కారణం చెప్పలేనన్న రేణు!
ఈ చిత్రంలో హేమలత లవణం పాత్రలో కీలక పాత్ర పోషించిన నటి రేణు దేశాయ్ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు ముచ్చటించారు.
By: Tupaki Desk | 20 Oct 2023 4:29 AM GMTమాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ నిర్మించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'టైగర్ నాగేశ్వరరావు'. నేటి నుంచి టైగర్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. గ్రిప్పింగ్ టీజర్, భారీ ట్రైలర్, చార్ట్‌బస్టర్ పాటలతో 'టైగర్ నాగేశ్వరరావు' ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ బజ్‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో హేమలత లవణం పాత్రలో కీలక పాత్ర పోషించిన నటి రేణు దేశాయ్ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు ముచ్చటించారు.
ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. హేమలత లవణం లార్జర్ దేన్ లైఫ్ పర్సనాలిటీ. ఆ రోజుల్లో ఆమె చంబల్ బుందేల్‌ఖండ్‌లకు వెళ్లి అక్కడ అనేక సంస్కరణలు చేసింది. ఆమె జోగినీ వ్యవస్థ , అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా పోరాడారు. హేమలత లవణం ఈ సినిమా ద్వారా యూత్‌కి స్ఫూర్తినిస్తుంది. ఇంత గొప్ప పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం... అని అన్నారు. హేమలత లవణం గురించి తెలుసుకోవాలని కొందరిని కలిశాను. లవణం మేనకోడలు కీర్తిని విజయవాడలో కలిశాను. ఆమె గురించి చాలా సమాచారం ఇచ్చింది. ఈ పాత్ర చేసేటప్పుడు అవన్నీ హెల్ప్ అయ్యాయి. నేను మాట్లాడేటప్పుడు సహజంగానే నా తల చాలా కదులుతుంది. కానీ హేమలత లవణం చాలా స్థిరంగా - హుందాగా ఉంటారు. నేను స్థిరమైన బాడీ లాంగ్వేజ్ కోసం ప్రయత్నించాను. తెలుగును కూడా స్పష్టంగా మాట్లాడేందుకు ప్రిపేరయ్యాను. నేను నిజాయితీగా ఆమెలా కనిపించడానికి ప్రయత్నించాను. ఈ పాత్ర నాకు చాలా సంతృప్తినిచ్చింది.. అని తెలిపారు.
నటనకు విరామం ఎందుకు? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ''నాకు నటించాలని అనిపిస్తుంది. అయితే కథ, పాత్ర, దర్శకుడు, నిర్మాత కలిసి రావాలి. ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు'కి మూడు వచ్చాయి. మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను'' అని అన్నారు.
సూపర్ స్టార్ మహేష్ తో ఆఫర్ గురించి రేణు దేశాయ్ మాట్లాడారు. మహేష్ నటించిన సర్కార్ వారి పాట చిత్రంలోని బ్యాంక్ ఆఫీసర్ పాత్రను నాకు ఆఫర్ చేసారు. అందులో నటించేందుకు అంగీకరించాను. కానీ చివరికి డ్రాపయ్యాను. ఇప్పుడు రీజన్ చెప్పలేను. దానికి కారణాలు ఇప్పుడు చెబితే కాంట్రవర్శీ అవుతుంది.. అని రేణు వ్యాఖ్యానించారు.
ఇద్దరు నాయికలు:
టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకుంది. చిత్రబృందం ప్రచారంలో స్పీడ్ గా ఉంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా నిర్మించారు.ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరు భామల అందచందాలు, నటన సినిమాకి ప్రధాన అస్సెట్ కానున్నాయి.