తెలుగు దర్శకుడు వేధించాడని నటి ఆరోపణ
మీటూ ఉద్యమం పర్యవసానం గురించి తెలిసినదే. చాలా మంది నటీమణులు తమకు జరిగిన అన్యాయాలను సోషల్ మీడియాల్లో బహిర్గతం చేసారు
By: Tupaki Desk | 1 Aug 2024 9:40 AM GMTమీటూ ఉద్యమం పర్యవసానం గురించి తెలిసినదే. చాలా మంది నటీమణులు తమకు జరిగిన అన్యాయాలను సోషల్ మీడియాల్లో బహిర్గతం చేసారు. ఇప్పటికీ ఈ ప్రకంపనలు ఆగలేదు. తాజాగా ప్రముఖ నటి మిటా వశిష్ట్ తనను ఒక తెలుగు నిర్మాత లైంగికంగా వేధించాడని ఆరోపించారు.
సహాయ నటి మిటా వశిష్ట్ చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్‌లో కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించారు. ఒక తెలుగు ఫిలింమేకర్ తనకు లీడ్ పాత్రను ఆఫర్ చేసి, రెండు నెలలు తనతో ఉండాల(సహజీవనం)ని ప్రతిపాదించాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతడు తనను వెంబడించడంతో పరిస్థితి తీవ్రమైంది. అదృష్టవశాత్తూ ఆ సన్నివేశం నుంచి సదరు నటీమణి సురక్షితంగా బయటపడింది.
ది లాలాన్‌టాప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిటా వశిష్ట్ ఆ తెలుగు ఫిలింమేకర్ పేరును ప్రస్తావించకుండా తన అనుభవాన్ని షేర్ చేసారు. తన గత చిత్రంలో జాతీయ అవార్డును గెలుచుకున్న అనంతరం తెలుగు ఫిలింమేకర్ తన సినిమాలో అవకాశం కల్పించాడు. పాత్రను ఆఫర్ చేసిన తర్వాత .. తనతో రెండు నెలలు ఉండాలని ప్రతిపాదించాడు. మొదట్లో అతడు మాట్లాడిన ఇంగ్లీషు ఉచ్ఛారణ కారణంగా తప్పుగా అర్థం చేసుకున్నానని ఆమె భావించింది. అతడు తన ఇంటిని సన్నాహకాల కోసం సందర్శించవలసి ఉంటుందని అన్నాడు.
అయితే అతడి ఉద్దేశాలు సరికావని స్పష్టమైంది. దీంతో ప్రారంభంలో గందరగోళంలో ఉన్న నటికి నెమ్మదిగా విషయం బోధపడింది. సదరు దర్శకుడు తనతో జీవించాలని స్పష్ఠంగా ప్రతిపాదించాడని అర్థం చేసుకుంది.
కానీ ఈ ఘటన సమయంలో మిటా స్నేహితులు కుమార్ షహానీ, ఖలీద్ మహ్మద్ పక్క గదిలోనే ఉన్నారు. ఆమె ఆఫర్‌ను తిరస్కరించాక బయలుదేరడానికి ప్రయత్నించింది. అయితే దర్శకుడు తలుపు వద్ద అడ్డుకున్నాడు. మిటా ఏదోలా అతడి నుంచి తప్పించుకుంది. తన స్నేహితుల వద్దకు తిరిగి వెళ్లింది.
స్నేహితులు ఏదో తప్పు జరిగిందని గ్రహించి, ఎవరైనా తప్పుగా ప్రవర్తించారా? అని అడిగారు. ఆ సమయంలో డైరెక్టర్ ఆ గది నుంచి జారుకున్నాడు. షహానీ- మహమ్మద్ ప్రశాంతంగా సన్నివేశాన్ని కామప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ దర్శకుడు కామంతో ఉన్నాడని తాజా చాటింగ్ సెషన్ లో మిటా గుర్తుచేసుకుంది. మితా వశిష్ట్ మాట్లాడుతూ తనను రాజీపడాల్సిందిగా కోరినా కానీ.. అది కుదరదని దర్శకులకు స్పష్టం చేసేదానిని అని కూడా తెలిపారు. అయినప్పటికీ కొందరు దర్శకులు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తూనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఒక్కసారి హద్దులు నిర్దేశిస్తే.. ప్రజలు తనను గౌరవించారని, వారు హద్దులు దాటలేదని మిటా అన్నారు.