సాయిపల్లవి సినిమా చూసి ముఖ్యమంత్రి పరవశం
శివకార్తికేయన్- సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన అమరన్ ప్రివ్యూ వీక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చిత్ర బృందాన్ని తనదైన శైలిలో అభినందించారు.
By: Tupaki Desk | 31 Oct 2024 8:14 AM GMTసాయిపల్లవి ఎంపికలు ఎప్పుడూ అసాధారణమైనవి. వైవిధ్యమైనవి.. కంటెంట్ ఉంటేనే ఒక పాత్రకు అంగీకరిస్తానని చాలా సార్లు ఈ ప్రతిభావని వెల్లడించారు. ఇప్పుడు అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలో నటించింది సాయిపల్లవి. ఈ సినిమా వీక్షించిన ముఖ్యమంత్రి ఏమని ప్రశంసించారో తెలుసా? .. వివరాల్లోకి వెళితే...
శివకార్తికేయన్- సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన అమరన్ ప్రివ్యూ వీక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చిత్ర బృందాన్ని తనదైన శైలిలో అభినందించారు. తమిళనాడు ఆర్మీ వెటరన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ కథతో ఈ సినిమా రూపొందింది. వరదరాజన్ ధైర్యాన్ని, అంకితభావాన్ని తెరపై అద్భుతంగా చూపిస్తూ శివకార్తికేయన్, సాయిపల్లవి పాత్రలను దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఆవిష్కరించిన తీరును ప్రశంసించారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆహ్వానం మేరకు తాను ఈ చిత్రాన్ని చూశానని కూడా సీఎం స్టాలిన్ తెలిపారు.
X ఖాతాలో MK స్టాలిన్ వ్యాఖ్యానిస్తూ.. నా స్నేహితుడు కళాకారుడు కమల్ హాసన్ ఆహ్వానాన్ని అంగీకరించిన తర్వాత నేను నిన్న అమరన్ సినిమా చూశాను. నేటి యువతకు నిజమైన కథలను పుస్తకాల రూపంలో - అలాగే సినిమాల రూపంలో అందజేయడం గొప్ప విషయం! దర్శకుడు తమిళనాడు ఆర్మీ వెటరన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ ధైర్యాన్ని, అంకితభావాన్ని ఎమోషనల్‌గా చిత్రీకరించారు. తమ పాత్రల్లో అద్భుతంగా నటించిన శివకార్తికేయన్, సాయిపల్లవికి శుభాభివందనలు. సిబ్బంది అందరికీ నా అభినందనలు! దేశాన్ని రక్షించే మన సైనికులకు బిగ్ సెల్యూట్ - మన స్మృతిలో నివసించే మేజర్ ముకుంద్ వరదరాజన్! ది గ్రేట్`` అని అన్నారు.
మేజర్ ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ అద్భుతంగా నటించారని స్టాలిన్ ప్రశంసించారు. భారత సైన్యం 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీటా కంపెనీని లీడ్ చేసిన సైనికుడి జీవితం, అతడి గొప్ప త్యాగం గురించి తెరపై చూపించారు. మేజర్ ముకుంద్ (శివకార్తికేయన్) వ్యక్తిగత జీవితం ..అతడు సైన్యంలో చేరాలనే నిర్ణయంపై కుటుంబం ప్రతిస్పందన.. ఇందు (సాయి పల్లవి)తో ప్రేమ కథను ఇందులో చూపించారు. ప్రతి ప్రాణాన్ని రక్షించి, తిరిగి వస్తాను సార్ అంటూ సైనికుడు శివకార్తికేయన్ వార్ లోకి వెళ్లిన విధానాన్ని తెరపై చూపించారు.
నిర్మాతలలో ఒకరైన కమల్ హాసన్ తన సోషల్ మీడియాలో ట్రైలర్‌ను షేర్ చేసినప్పుడు దీనికి అద్భుత స్పందన వచ్చింది. ``నాయకులు చాలా అరుదుగా నడిచే మార్గాన్ని ఎంచుకుంటారు. వారు లేని చోట ఒక దారిని సృష్టించి కొత్త బాటను వెలిగిస్తారు. తమిళనాడుకు చెందిన #మేజర్ ముకుంద్ వరదరాజన్ అలాంటి నాయకుడు. మేము అతని కథను తెరపై చూపించేందుకు గర్వపడుతున్నాము`` అని అన్నారు.
శివ్ అరూర్ - రాహుల్ సింగ్ పుస్తకం ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్‌లో డాక్యుమెంట్ చేసిన నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొంది ఈ సినిమాను రూపొందించారు. అమరన్ సినిమా నిజమైన హీరోకి నివాళి. ఈ సినిమా తెలుగులోను విడుదలైంది.