AIతో ఆస్కార్ గ్రహీత MM కీరవాణి సంచలనం
ఆయన తదుపరి విడుదల ఆశిష్ రెడ్డి - వైష్ణవి చైతన్య నటించిన లవ్ మీ - ఇఫ్ యు డేర్. ఘోస్ట్ లవ్ పాట మొత్తం కంపోజ్ చేయడానికి కీరవాణి AIని ఉపయోగించారని
By: Tupaki Desk | 10 April 2024 4:59 AM GMTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంగీతాన్ని రూపొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతోంది. ఏఐలో దివంగత గాయనీగాయకుల గాత్రాలను క్రియేట్ చేస్తుండడం లేటెస్ట్ ట్రెండ్. రజనీకాంత్ 'లాల్ సలామ్'లోని ట్రాక్ కోసం AR రెహమాన్ దివంగత గాయకులు బాంబా బాక్యా - షాహుల్ హమీద్ స్వరాలను పునఃసృష్టించారు. అయితే ఈ కృత్రిమ మేధస్సు వినియోగంపై ఒక వర్గం ప్రజల నుంచి తీవ్ర విమర్శల్ని ఎదుర్కొనాల్సి వచ్చింది.
దీనికి ముందు నేచురల్ స్టార్ నాని నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'హాయ్ నాన్నా'లో ఒక పాట కోసం హేషమ్ అబ్దుల్ వహాబ్ AIని ఉపయోగించారు. మరోవైపు 'కీడా కోలా'లో దివంగత లెజెండ్ SP బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌ని పునఃసృష్టి చేయడానికి వివేక్ సాగర్ AIని ఉపయోగించడం హాట్ టాపిక్ అయింది. ప్రముఖుల గొంతును సజీవంగా పునఃసృష్టి చేయడంలో సక్సెసైనా కానీ కొన్ని విమర్శల్ని మాత్రం ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇప్పుడు ఆస్కార్ గ్రహీత కీరవాణి వంతు. నాటు నాటు (RRR) కోసం ఆస్కార్‌ను గెలుచుకున్న వ్యక్తి MM కీరవాణి సంగీతాన్ని రూపొందించడానికి AIని ఉపయోగించారు. ఆయన తదుపరి విడుదల ఆశిష్ రెడ్డి - వైష్ణవి చైతన్య నటించిన లవ్ మీ - ఇఫ్ యు డేర్. ఘోస్ట్ లవ్ పాట మొత్తం కంపోజ్ చేయడానికి కీరవాణి AIని ఉపయోగించారని, మొత్తం పాటకు AI గాత్రాన్ని ఉపయోగించిన తొలి తెలుగు సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించారని ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో దిల్ రాజు వెల్లడించారు. హర్షిత్ రెడ్డి, హన్సితారెడ్డి, నాగ మల్లిడి నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం 25 ఏప్రిల్ 2024న గ్రాండ్ రిలీజ్ కానుంది.