'చంద్రముఖి-2' కీరవాణిని ముందే భయపెట్టిందా!
మ్యూజిక్ లెజెండ్ కీరవాణి గురించి చెప్పాల్సిన పనిలేదు. కొన్ని ధశాబ్ధాల ప్రయాణం ఆయనది. ఎన్నో చిత్రాలకు సంగీతం సమకూర్చారు
By: Tupaki Desk | 25 Sep 2023 7:30 AM GMTమ్యూజిక్ లెజెండ్ కీరవాణి గురించి చెప్పాల్సిన పనిలేదు. కొన్ని ధశాబ్ధాల ప్రయాణం ఆయనది. ఎన్నో చిత్రాలకు సంగీతం సమకూర్చారు. సంగీతంలో ఆయనో ఎన్ సైక్లో పీడియా. 'నాటు నాటు' పాటతో ఆస్కార్ సైతం అందుకున్నారు. దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడిగా నిలిచారు. భారతీయ జెండాని ఆస్కార్ వేదికపై రెప రెపలాండిచిన మొట్ట మొదటి తెలుగు సంగీత దర్శకుడిగా చరిత్రకెక్కారు.
అంతటి లెజెండ్ కే చంద్రముఖి సవాల్ విసిరిందా? ఈ సినిమాకి సంగీతం అందించడంలో కీరవాణి ఇబ్బంది పడ్డారా? అంటే అవుననే తెలుస్తోంది. స్వయంగా ఈ విషాయన్ని ఆయనే రివీల్ చేసారు. 'చంద్రముఖి' సినిమాకి గురుకిరణ్ - విద్యాసాగర్ సంగీతం పరంగా ఒక మార్కును సెట్ చేశారు. ఆసినిమా పాటలకు సంగీతం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇప్పుడు నేను ఆ మార్కును తట్టుకుని నేను పనిచేయడం కష్టమైంది. ట్యూన్స్ చేసే సమయంలో కొన్ని రకాల కన్యూజన్లు మెదిలాయి.
అన్నింటిని దాటుకుని నా వంతు ప్రయత్నం చేశాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే ఆశిస్తున్నాను. 'చంద్రముఖి 2' సినిమాలో దెయ్యాన్ని చూపించకుండానే వాసుగారు భయపెట్టారు. ఆయనతో కలిసి ఇంతకుముందు పనిచేశాను. కానీ లైకా .. లారెన్స్ .. కంగనాలతో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. వాళ్లు చాలా గొప్పగా చేశారు. వాళ్ల కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుంది' అని అన్నారు.
'చంద్రముఖి' రిలీజ్ కి ముందే మ్యూజికల్ గా మంచి హిట్ అయింది. పాటలన్నీ వేటికవి ప్రత్యేకంగా హైలైట్ అయ్యాయి. కథానుసారం సాగే పాటలు శ్రోతల్ని విశేషంగా అలరించాయి. ముఖ్యంగా చంద్రముఖి సాంగ్ సినిమాని నెక్స్ట్ లెవల్లో నిలబెట్టింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సినిమాకది బెంచ్ మార్క్ సాంగ్. మరి అలాంటి పాటని కీరవాణి అందించారా? అన్నది చూడాలి. ఈ మధ్య కాలంలో కీరవాణి తెలుగు సినిమాలకంటే ఎక్కువగా తమిళ సినిమాలకు పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. రీసెంట్ గా మరో రెండు ప్రాజెక్ట్ లు కూడా అక్కడే చేస్తున్నారు.