పాన్ ఇండియాని ఊపలేకపోతున్న త్రయం!
సౌత్ సహా బాలీవుడ్ లోనూ సినిమాలు చేసారు. కానీ వీళ్లు కూడా పాన్ ఇండియాకి కనెక్ట్ అవ్వడంలో వైఫల్యమవుతున్నారు.
By: Tupaki Desk | 4 Jan 2025 6:31 AM GMTకోలీవుడ్ స్టార్ ధనుష్ పాన్ ఇండియాలో క్రేజ్ ఉన్న నటుడు. అతడి సినిమాలు తమిళ్ తో పాటు సౌత్ లోనే పెద్ద ఎత్తున రిలీజ్ అవుతాయి. ఇక హిందీలో అయితే నటుడిగా ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న నటుడు. `రాంజానా`, `ఆత్రాంగిరే` లాంటి సినిమాలతో హిందీ మార్కెట్ లో బాగా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ లో ఎప్పుడో చేరాడు. ఇంగ్లీష్ లో సైతం కొన్ని సినిమాలు చేసాడు. ఇలా ధనుష్ ఇమేజ్ దేశాన్నే దాటింది.
కానీ పాన్ ఇండియాలో మాత్రం గ్రాండ్ విక్టరీ ఇంత వరకూ నమోదు కాలేదు. ఎందుకనో ధనుష్ సినిమాలు పాన్ ఇండియాకి ఏక కాలంలో కనెక్ట్ అవ్వడం లేదు. సరిగ్గా మరో స్టార్ హీరోల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మాలీవుడ్ స్టార్స్ దుల్కర్ సల్మాన్, పృధ్వీరాజ్ సుకుమారన్ కి కూడా పాన్ ఇండియాలో గుర్తింపు ఉంది. సౌత్ సహా బాలీవుడ్ లోనూ సినిమాలు చేసారు. కానీ వీళ్లు కూడా పాన్ ఇండియాకి కనెక్ట్ అవ్వడంలో వైఫల్యమవుతున్నారు.
దుల్కర్ మాలీవుడ్ తో పాటు పాన్ ఇండియాకి కేరాఫ్ అడ్రస్ అయిన టాలీవుడ్ లో ఎంతో ఫేమస్ అయిన నటుడు. వంద కోట్ల వసూళ్లు తెలుగు మార్కెట్ నుంచే రాబట్ట గలిగే నటుడాయన. `మహానటి`, `సీతారామం`, `కల్కి 2898` లాంటి సినిమాలు పాన్ ఇండియాలో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. కానీ పాన్ ఇండియాని షేక్ చేసే కంటెంట్ సినిమాలు చేయడంలో విఫలమవుతున్నాడు. కొంత కాలంగా టాలీవుడ్ పైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు. మరి ఈసారైనా అనుకున్నది సాధిస్తాడేమో చూడాలి.
ఇక పృధ్వీరాజ్ సుకుమారన్ మల్టీ ట్యాలెంటెడ్. హీరో ఇమేజ్ తో పాటు క్రియేటివ్ గానూ రాణిస్తున్నాడు. కథలు రాస్తాడు. సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు. హిందీలోనూ రెండు..మూడు చిత్రాలు చేసాడు. `ది గోట్ లైఫ్` సినిమాతో మరింత దగ్గరయ్యాడు. ఓటీటీ రిలీజ్ లతోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. కానీ సరైన పాన్ ఇండియా హిట్ ఒక్కటీ పడలేదు. ధనుష్ `కుబేర`తో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. పృధ్వీరాజ్ ఈ మధ్య కమిట్ అవుతున్న చిత్రాలు తమిళ్, హిందీ నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దుల్కర్ తమిళ్ సహా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ ముగ్గురు హీరోలకు కొత్త ఏడాదైనా కలిసొస్తుందేమో చూడాలి.