Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్, ప్రభాస్ లకు తెలుగులో డబ్బింగ్.. దారుణం సామీ

ఇండియన్ నెంబర్ వన్ దర్శకుడు ఎవరంటే వెంటనే ఎస్.ఎస్ రాజమౌళి పేరు చెబుతారు.

By:  Tupaki Desk   |   23 July 2024 3:54 AM GMT
ఎన్టీఆర్, ప్రభాస్ లకు తెలుగులో డబ్బింగ్.. దారుణం సామీ
X

ఇండియన్ నెంబర్ వన్ దర్శకుడు ఎవరంటే వెంటనే ఎస్.ఎస్ రాజమౌళి పేరు చెబుతారు. కెరియర్ లో అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి దూసుకుపోతున్నాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసిన రాజమౌళి తర్వాత వరుస సక్సెస్ లు అందుకొని తన ఇమేజ్ పెంచుకుంటూ వచ్చారు. మగధీర సినిమా తోనే రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఒక ఈగని హీరోగా పెట్టి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నారు.

బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ లు అందుకోవడంతో పాటుగా వరల్డ్ వైడ్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. హాలీవుడ్ మేకర్స్ సైతం రాజమౌళి టేకింగ్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఇప్పటివరకు సాధ్యం కాని ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి అందుకున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సైతం ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ జక్కన్న చేయబోతున్నారు. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే సీనియర్ జర్నలిస్ట్ అనుపమ చోప్రా రాజమౌళి పైన మోడ్రన్ మాస్టర్స్ అనే ఒక డాక్యుమెంటరీ సిరీస్ చేశారు. త్వరలో ఇది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రజెంటేషన్ బాగానే ఉన్నా కూడా తెలుగు వెర్షన్ డబ్బింగ్ మాత్రం ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు.

ఒక తెలుగు డైరెక్టర్ గురించి తెలుగు స్టార్ హీరోలు చెప్పినప్పుడు వారి ఒరిజినల్ వాయిస్ తో కంటెంట్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజమౌళి సొంత గొంతుకతో తన ఐడియాలజీ నేరేట్ చేస్తే అది ఇంకా ఎక్కువగా తెలుగు ఆడియన్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉండేదనే మాట వినిపిస్తోంది. మోడ్రన్ మాస్టర్స్ ట్రైలర్ చూస్తుంటే ఒక ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్ ని తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో చూస్తున్న ఫీలింగ్ కలుగుతోందని విశ్లేషకులు అంటున్నారు.

నెటిజన్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడ్రన్ మాస్టర్స్ ట్రైలర్ తెలుగులో చూస్తున్నప్పుడు ఒక ఎమోషన్ మిస్ అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి వారి సొంత వాయిస్ తో తెలుగులో డబ్బింగ్ చెప్పి ఉంటే బాగా కనెక్ట్ అయ్యేదనే మాట వినిపిస్తోంది. మరి సిరీస్ ప్రసారంలో అయిన నెట్ ఫ్లిక్స్, మేకర్స్ పునరలోచన చేస్తారేమో వేచి చూడాలి.