నచ్చని రంగులో నమ్రత..ఎందుకంటే?
తాజాగా సూపర్ స్టార్ మహేష్ సతీమణి మనసుకు నచ్చని రంగు గల డ్రెస్ ని ధరించారు.
By: Tupaki Desk | 29 Dec 2023 11:53 AM GMTఏ పనైనా నచ్చితేనే చేయాలి..ఏ డ్రెస్ అయినా సరే మనసుకు నచ్చితేనే వేసుకోవాలి. కానీ నచ్చని పని... నచ్చని డ్రెస్ కూడా వేసుకోవాల్సిన సందర్భాలంటూ కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు తప్పదు. నచ్చని పనైనా తప్పక చేయాలి. నచ్చని డ్రెస్ అయినా తప్పని పరిస్థితుల్లో ధరించాలి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ సతీమణి మనసుకు నచ్చని రంగు గల డ్రెస్ ని ధరించారు. డార్క్ బ్లూ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్ లో నమ్రత తళుక్కున మెరిసారు.
టాప్ టూ బాటమ్ నమ్రత అదే డ్రెస్ లో కనిపిస్తున్నారు. ఇక డ్రెస్ పై ఎలాంటి డిజైన్ కూడా లేదు. కొన్నిసార్లు ఇది నాకు నచ్చే రంగు కాదు..కానీ వేసుకున్నాను అని అర్దం వచ్చేలా ఆ డ్రెస్ ని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ ఫోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే అంతగా నచ్చని డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? అని అభిమానులు అడుగుతున్నారు. కానీ నమ్రత నుంచి మాత్రం ఎలాంటి రిప్లై రాలేదు.
ఇక నమ్రత ముస్తాబైన విధానం మాత్రం అభిమానుల్ని అలరిస్తుంది. ఆ డ్రెస్ ఆమెకి నచ్చకపోయినా అభిమానులకు నచ్చింది. ఔట్ ఫిట్ లో ఆమె ఎంతో అందంగా ఉన్నారంటూ కామెంట్లు పోస్త్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్...లుకింగ్ స్టైల్...కెమెరాకి ఇచ్చిన భంగిమ సూపర్బ్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం నమ్రత న్యూ ఇయర్ సెలబ్రేషన్ల కోసం దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ రోజు ఉదయమే ప్లైట్ ఎక్కారు. అయితే ఈ పిక్ పాతదిలా తెలుస్తుంది. జర్నీలో ఇలా టైం పాస్ గా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు.