Begin typing your search above and press return to search.

అకీరాపై మోడీ జోక్..అదేంటంటే?

అయితే మోదీ..అకీరాను ఆ స‌మ‌యంలో ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకుని కౌగిలించుకున్నారు. భుజం త‌ట్టి జీవితంలో ఎద‌గాల‌ని ప్రోత్స‌హించారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 4:30 PM GMT
అకీరాపై మోడీ జోక్..అదేంటంటే?
X

ఏపీలో కూట‌మి అధికారంలోకి రావ‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంతోషం మాట‌ల్లో చెప్ప‌లేనిది. పార్టీ స్థాపించిన త‌ర్వాత ఇన్నాళ్ల‌కి క‌ష్టానికి ద‌క్క‌డంతో ఎంతో సంతోషంలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఎన్న‌డు లేనిది తొలిసారి కుమారుడు అకీరానంద‌న్ ని కూడా వెంట తిప్పుకుంటున్నారు. మొన్న కాబోయే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లి ఆశీర్వ‌చ‌నాలు ఇప్పించారు. అటుపై ప్ర‌ధాని నరేంద్ర మోదీని స‌తీస‌మేతంగా ఢిల్లీలో క‌లిసారు. ఆ స‌మ‌యంలో అకీరా కూడా వెంట ఉన్నాడు.

మోదీ ఆశీస్సులు కూడా అకీరా తీసుకున్నాడు. ఇప్పుడా ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికిప్పుడు అకీరానా ఇలా తెర‌పైకి తేవ‌డం వెనుక మీడియాలో ర‌క‌ర‌కాల డిస్క‌ష‌న్స్ సాగుతున్నాయి. అది వేరే సంగ‌తి . అయితే మోదీ..అకీరాను ఆ స‌మ‌యంలో ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకుని కౌగిలించుకున్నారు. భుజం త‌ట్టి జీవితంలో ఎద‌గాల‌ని ప్రోత్స‌హించారు. అదే స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్నా ప‌వ‌న్...అన్నాలెజ్నీవా ఒక్క‌సారిగా న‌వ్వేసారు.

అకీరా కూడా పెదాల‌పై కూడా న‌వ్వు క‌నిపించింది. ఒక్క‌సారిగా ఆ ముగ్గురు ఎందుకు న‌వ్వారో? తెలియ‌దు గానీ అకీరా ఎత్తు గురించి మెదీ స‌రదాగా జోకు వేసి ఉంటార‌ని అభిమానులు భావిస్తున్నారు. మ‌రి ఆ జోకు ఎత్తు గురించా? మ‌రేదైనా అంశం గురించా? అన్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పాలి. అకీరా అంత హైట్ ఉన్నా ఇంకా అత‌డి వ‌య‌సు 20 ఏళ్లు అన్న సంగ‌తి తెలిసిందే. అకీరా మెగా ఫ్యామిలీ పొలిక‌లు వ‌చ్చేసాయి.

మెగా ఫ్యామిలీ లో అంద‌రికంటే ఎత్తు వ‌రుణ్ తేజ్. అదే పొలిక అకీరాకి వ‌చ్చేసింది. మ‌రి ఈ సంతోష స‌మ‌యంలో త‌ల్లి రేణు దేశాయ్ కూడా అకీరాని అలా చూసి ఎంత సంతోష ప‌డుతున్నారో? గెస్ చేయోచ్చు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో విడాకుల త‌ర్వాత పిల్ల‌లు ఇద్ద‌రు రేణు దేశాయ్ ద‌గ్గ‌రే ఉన్న సంగ‌తి తెలిసిందే. పండ‌గ‌లు..ప‌బ్బాలు వ‌చ్చినప్పుడు మాత్రం పిల్ల‌లు మెగా ఫ్యామిలీతో క‌లిసి సందడి చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.