'ఎక్స్' లో మోడీ సరికొత్త రికార్డ్... ఈ రికార్డ్ ఎవరికీ లేదు!
వరుసగా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ సరికొత్త మైలురాయిని దాటారు.
By: Tupaki Desk | 15 July 2024 6:55 AM GMTవరుసగా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ సరికొత్త మైలురాయిని దాటారు. ఇందులో భాగంగా... సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'ఎక్స్'లో అత్యధిక ఫాలోవర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ఆయనకున్న ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లకు చేరింది.
అవును... ఎక్స్ లోని ఫాలోవర్ల సంఖ్యలో మోడీ రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో ఎక్స్ లో ఫాలోవర్ల సంఖ్యలో మరే నాయకుడు మోడీ కంటే ముందులేరనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 38.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. దుబాయ్ కు చెందిన షేక్ మహమ్మద్ ను 11.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
ఇదే క్రమంలో... పోప్ ఫ్రాన్సిస్ కు 18.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు... ఎంటర్ టైన్మెంట్ ప్రపంచంలో చాలా మంది సెలబ్రెటీల కంటే మోడీ ముందున్నారు. ఇందులో భాగంగా టేలర్ స్విఫ్ట్ కు 95.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా.. లేడీ గాగాను అనుసరించే వారి సంఖ్య 83 మిలియన్లుగా ఉంది.
కిమ్ కర్దాషియాన్ కు 75.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక క్రీడాకారుల విషయానికొస్తే... 'ఎక్స్' లో విరాట్ ఫాలోవర్స్ సంఖ్య 64.1 మిలియన్లు కాగా.. బ్రెజిల్ స్టార్ నేమార్ కు 63.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. బాస్కెట్ బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ కు 52.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
అయితే... 'ఎక్స్' తో పాటు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా మోడీ ట్విట్టర్ (ఎక్స్)లో 2009లో చేరారు.