మెగాస్టార్ డెబ్యూ ఈ రేంజ్ లో ఊహకే రాలేదే!
కెప్టెన్ గా కంప్లీట్ స్టార్ వెండి తెరపై అద్భుతం చేయబోతున్నాడు అనే బజ్ భారీగా క్రియేట్ అయింది. మరి ఆయన స్వీయా దర్శకత్వంలో తెరకెక్కిన `బరోజ్` ఫలితం చూస్తే షాక్ అవ్వాల్సిందే.
By: Tupaki Desk | 30 Dec 2024 7:30 PM GMTమలయాళ చిత్ర పరిశ్రమలో కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా 400 సినిమాలకు దగ్గరగా ఉన్నారు. ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించినట నటుడాయన. ఏడాదికి కనీసం ఆరు సినిమాలతోనైనా ప్రేక్షకుల్లో ఉంటారాయన. అందుకే అన్ని సినిమాలు రిలీజ్ చేయగలిగారు. అలాంటి లెజెండరీ నటుడు తొలిసారి దర్శకుడు అవుతున్నారంటే? అంచనాలు అదే స్థాయిలో ఏర్పడ్డాయి.
కెప్టెన్ గా కంప్లీట్ స్టార్ వెండి తెరపై అద్భుతం చేయబోతున్నాడు అనే బజ్ భారీగా క్రియేట్ అయింది. మరి ఆయన స్వీయా దర్శకత్వంలో తెరకెక్కిన `బరోజ్` ఫలితం చూస్తే షాక్ అవ్వాల్సిందే. క్రిస్మస్ ని పురస్కరించుకుని సినిమా డిసెంబర్ 25న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ తెలుగు ఆడియన్స్ కి బాగా తెలుసిన హీరో కావడంతో? ఇక్కడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ సినిమా ఫలితం చూస్తే షాక్ అవ్వాల్సిందే.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఓపెనింగ్ డే రోజున ఈ సినిమా 3.4 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. అటుపై రెండవ, మూడవ రోజు వసూళ్లు తగ్గుముఖం పట్టాయి రెండవ రోజు 1.6 కోట్లు, మూడవ రోజు1.1 కోట్లు రాబట్టింది. ఇక నాలుగో రోజు కాస్త మెరుగ్గా కనిపించింది. 1.25 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా ఇప్పటివరకూ 7.36 కోట్లు వసూళ్లు మాత్రం రాబట్టింది. సినిమా లాంగ్ రన్ లో 10 కోట్లు కూడా రావడం కష్టంగానే కనిపిస్తుంది.
ఆ లెక్కన చూస్తే సినిమా 90 శాతం నష్టాల్లో కనిపిస్తుంది. ఈ సినిమాకి అయిన బడ్జెట్ 25 కోట్లు అని సమాచారం. ఐదు రోజుల్లోనే పదికోట్లు రాబట్ట లేదంటే ఈ సినిమా పరిస్థితి ఏంటి అన్నది తేలిపోతుంది. మోహన్ లాల్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇంత వీక్ వసూళ్లు చూసి జీర్ణించుకోలేని పరిస్థితి అభిమానులది. ఈ సినిమా వైఫల్యం నేపథ్యంలో కంప్లీట్ స్టార్ మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన హీరోగా లూసీఫర్ -2 తెరకెక్కుతోంది. అలాగే దృశ్యం-3కి రంగం సిద్దం చేస్తున్నారు.