Begin typing your search above and press return to search.

మోహన్ లాల్ 'బరోజ్'.. తెలుగు ట్రైలర్ చూశారా?

ఇప్పుడు మేకర్స్ తాజాగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ బంగ్లా లోపల ఎవరికీ కనిపించని భూతం ఉంది అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది.

By:  Tupaki Desk   |   16 Dec 2024 1:07 PM GMT
మోహన్ లాల్ బరోజ్.. తెలుగు ట్రైలర్ చూశారా?
X

మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్.. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. తన లైనప్ తో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నా.. సరైన హిట్స్ ను అందుకోలేకపోతున్నారు. మలైకుట్టి వాలీబాన్ చిత్రం భారీ హిట్ అవుతుందనుకుంటే.. డిజాస్టర్ గా మారింది. ప్రస్తుతం ఆయన బరోజ్ మూవీతో బిజీగా ఉన్నారు.

మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బరోజ్ సినిమా.. పూర్తిగా 3డీలో సిద్ధమవుతోంది. ఆ మూవీతోనే ఆయన ఇండస్ట్రీకి డైరెక్టర్ కు పరిచయం అవుతున్నారు. మోహన్ లాల్ సొంత సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూరు బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.

అయితే తెలుగులో కూడా బరోజ్ మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ బాధ్యతలను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంది. ఇప్పటికే విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది.

ఇప్పటికే బరోజ్ ట్రైలర్ రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. హాలీవుడ్ లెవెల్ విజువల్స్‌, అద్భుతమైన గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మేకర్స్ తాజాగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ బంగ్లా లోపల ఎవరికీ కనిపించని భూతం ఉంది అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఇంతలో మోహన లాల్(బరోజ్) ఎంట్రీ ఇచ్చారు.

వాస్కోడిగామా దాచిన నిధి కాపాడుతున్న జెనీ పాత్రలో కనిపించారు. అయితే ఆ సంపదను ఎందుకు బరోజ్ కాపాడుతున్నారు? అందుకు కారణమేంటి? చివరకు ఎవరికి ఇస్తారు? అందుకు జెనీ చేసిన ప్రయత్నాలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలే సినిమాగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు ట్రైలర్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్రైలర్ లో విజువల్స్ చాలా రిచ్ కనిపిస్తున్నాయి. వీఎఫ్ ఎక్స్ ఓ రేంజ్ ఉంది. మార్క్ కిలియన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మోహన్ లాల్ తన యాక్టింగ్ తో సినిమాలో మెప్పించేలా కనిపిస్తున్నారు. మిగతా క్యాస్టింగ్ అంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేసినట్లు ఉన్నారు. అయితే మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న బరోజ్ మూవీ తెలుగులో ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.