మెగాస్టార్ తో సినిమా చేస్తానంటోన్న మోహన్ లాల్!
చింజీవి-మోహన్ లాల్ మంచి స్నేహితులు కూడా. హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఇద్దరు తప్పక కలుస్తుంటారు. మరి ఈ స్నేహంతో ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్ అవుతుందేమో చూద్దాం.
By: Tupaki Desk | 25 Dec 2024 2:41 PM GMTటాలీవుడ్ తో కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. మాలీవుడ్ లో అతనో లెజండరీ నటుడు. కానీ టాలీవుడ్ లో ఛాన్స్ వచ్చిందంటే? నో చెప్పకుండా సినిమాలు చేస్తారు. పాత్ర ఎలాంటి దైనా? పరి పూర్ణ నటుడని ప్రతీ సందర్భంలోనూ రుజువు చేస్తారు. 'జనతా గ్యారేజ్' తో మోహన్ లాల్ క్రేజ్ టాలీవుడ్ లో మరింత రెట్టింపు అయింది. అప్పటికే తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు. 'జనతా గ్యారేజ్' తో నెటి జనరేషన్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు.
నటుడిగా, నిర్మాతగా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా ఆయన 'బరోజ్' సినిమాతో దర్శకుడిగానూ పరిచయం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మనసులో మాటను బయట పెట్టారు. తెలుగు హీరోల్లో ఒకర్ని డైరెక్ట్ చేయాలంటే? మీరు ఏ హీరోను ఎంచుకుంటారు అంటే? ఆయన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పారు. తెలుగు సినిమా తీయాలనుకుంటే వెంటనే చిరంజీవి గారికే కాల్ చేస్తానన్నారు.
చింజీవి-మోహన్ లాల్ మంచి స్నేహితులు కూడా. హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఇద్దరు తప్పక కలుస్తుంటారు. మరి ఈ స్నేహంతో ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్ అవుతుందేమో చూద్దాం. చిరంజీవి కూడా కొత్త దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తోన్న సంగతి తెలిసిందే. మోహన్ లాల్ తెలుగులో 1994లో అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ నటించిన 'గాండీవం'లో నటించారు. ఆ తర్వాత మళ్లీ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయలేదు.
'మనమంతా' అనే సినిమా రిలీజ్ చేసారు. కానీ ఓ మలయాళ చిత్రం. అటుపై 'జనతా గ్యారేజ్' లో కీలక పాత్ర పోషించారు. ఆ పాత్ర మోహన్ లాల్ కి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం మలయాళ సినిమాలే ఎక్కువగా చేస్తున్నారు. ఏడాదికి ఆరేడు సినిమాలైనా రిలీజ్ చేయడం మోహన్ లాల్ ప్రత్యేకత.