కలెక్షన్ కింగ్ పేరిట స్వర్ణోత్సవాలు 2025లోనా!
ఈ నేపథ్యంలో కలెక్షిన్ కింగ్ మోహన్ బాబు కూడా నట ప్రయాణంలో నేటితో 50వ వసంతంలోకి అడుగు పెట్టారు.
By: Tupaki Desk | 22 Nov 2024 7:09 AM GMTఇటీవలే నటసింహ బాలకృష్ణ పేరిట చిత్ర పరిశ్రమ ఘనంగా స్వర్ణోత్సవాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బాలయ్య నట ప్రస్తానానికి 2024 ఆగస్టుతో 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర పరిశ్రమ తరుపున స్వర్ణోత్సవాలు నిర్వహించి ఘనంగా సత్కరించింది. ఇప్పటి వరకూ ఏ నటుడి పేరిట ఇలాంటి వేడుకలు పరిశ్రమ నిర్వహించలేదు. ఇలాంటి వేడుక తెలుగు పరిశ్రమ తరుపున నిర్వహించడం అదే తొలిసారి.
దీంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ కొత్త విధానానికి నాంది పలికినట్లు అయింది. బాలయ్య తరం నటులందర్నీ ఆ రకంగా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో కలెక్షిన్ కింగ్ మోహన్ బాబు కూడా నట ప్రయాణంలో నేటితో 50వ వసంతంలోకి అడుగు పెట్టారు. 1975 నుంచి 1990 వరకూ మోహన్ బాబు భారతీయ సినిమాల్లో ప్రతి నాయక పాత్రలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. 1990 దశకంలో కథానాయకుడిగా అలరించారు.
570కి పైగా సినిమాల్లో నటించి ఆ పాత్రలకి జీవం పోసారు. సినిమా నిర్మాణంలోనూ ఆయన ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. ఓనటుడు నిర్మాతగా మారి 75 చిత్రాల్ని నిర్మించిన ఘతన ఆయనకే సొంతం. సినిమా రంగంలో ఆయన చేసిన సేవకు గానూ పద్మశ్రీ పురస్కారంతో పాటు పలు గౌరవాల్ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు పేరిట నేటి నుంచి వచ్చే ఏడాది నవంబర్ 22 వరకూ ప్రతీ నెలలో వేడుకను నిర్వహిస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు.
మరి తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరుపున మోహన్ బాబు పేరిట కూడా స్వర్ణోత్సవాలు నిర్వహిస్తారా? లేదా? అన్నది తెలియాలి. మోహన్ బాబు నేటి తో నటుడిగా 50వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ విషయాన్ని చిత్ర పరిశ్రమ గుర్తించాల్సిన అవసరం ఉంది. బాలయ్య పేరిట స్వర్ణోత్సవాలను 50 ఏళ్లు పూర్తయిన తర్వాత నిర్వ హించింది. మరి మోహన్ బాబు పేరిట కూడా 2025 నవంబర్ కల్లా ఇలాంటి వేడుకలు పరిశ్రమ తరుపున నిర్వహించే అవకాశం ఉంది. మరి ఈ గ్యాప్ లో నెలకో ఈవెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి ఈవెంట్లతో మంచు ఫ్యామిలీ నిలుస్తుందో చూడాలి.