Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ చేయాల్సిన‌ది క‌న్న‌ప్ప‌: మోహ‌న్ బాబు

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేయాల్సిన సినిమా క‌న్న‌ప్ప అని అన్నారు మంచు మోహ‌న్ బాబు.

By:  Tupaki Desk   |   15 Jun 2024 3:42 AM GMT
ప్ర‌భాస్ చేయాల్సిన‌ది క‌న్న‌ప్ప‌: మోహ‌న్ బాబు
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేయాల్సిన సినిమా క‌న్న‌ప్ప అని అన్నారు మంచు మోహ‌న్ బాబు. మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న క‌న్న‌ప్ప చిత్రంలో మోహ‌న్ బాబు ఒక కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. తాజాగా సినిమా టీజ‌ర్ లాంచ్ వేడుక‌లో ఆయ‌న మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఈ వేదిక‌పై దివంగ‌త కృష్ణం రాజు త‌న‌తో అన్న మాట‌ల‌ను ఎంబి గుర్తు చేసుకున్నారు.

విష్ణు కోసం రైట్స్ ఇవ్వాల‌ని తాను కోర‌గా, క‌న్న‌ప్ప చిత్రాన్ని ప్ర‌భాస్ తో తీస్తాన‌ని కృష్ణం రాజు అన్నారు. కానీ విష్ణు కోసం రైట్స్ ఇచ్చేస్తాన‌ని, అలాగే తాను డెవ‌ల‌ప్ చేయించిన కంటెంట్ ని కూడా ఇచ్చేస్తాన‌ని అన్నట్టు తెలిపారు. ప్ర‌భాస్ తో క‌న్న‌ప్ప తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం గురించి గ‌తంలో కూడా త‌న‌తో కృష్ణం రాజు అన్నార‌ని కూడా మోహ‌న్ బాబు తెలిపారు.

నిజానికి రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు జీవించి ఉన్న కాలంలో ప్ర‌భాస్ కోసం కొన్నేళ్ల పాటు క‌న్న‌ప్ప స్క్రిప్టు కోసం శ్ర‌మించారు. దీనిపై ర‌చ‌యిత‌ల బృందం ప‌ని చేసారు. ప్ర‌భాస్ ని డైరెక్ట్ చేయాల‌ని కృష్ణం రాజు క‌ల‌గ‌న్నారు. కానీ ఆ క‌ల నెర‌వేర‌లేదు. బాహుబ‌లి త‌ర్వాత డార్లింగ్ ప్ర‌భాస్ క్రేజ్ అమాంతం స్కైని తాకింది. దాంతో వ‌రుసగా పాన్ ఇండియా సినిమాలే చేయాల్సొచ్చింది. పెద‌నాన్న ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తాన‌ని కూడా ప్ర‌భాస్ అన్నాడు. కానీ కుద‌ర‌లేదు. ఇంత‌లోనే ఆయ‌న క‌ల నెర‌వేర‌కుండానే కాలం చేసారు. బాహుబ‌లి1, 2 త‌ర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్- సలార్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టించాడు ప్ర‌భాస్. ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ తో క‌ల్కి లాంటి భారీ ప్ర‌యోగం చేసాడు. ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.