Begin typing your search above and press return to search.

భార్యతో మోహన్ బాబు.. జాలిగా అలా..

ఇక తల్లిదండ్రుల ఫొటోలు షేర్‌ చేసిన మంచు లక్ష్మి.. "మీరు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను.

By:  Tupaki Desk   |   29 July 2023 10:23 AM GMT
భార్యతో మోహన్ బాబు.. జాలిగా అలా..
X

టాలీవుడ్‌లో మంచు కుటుంబంకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఆ కుటుంబంపై వచ్చినంత ట్రోల్స్ ఇతర బడా ఫ్యామిలీలపై రావు. ఓ రేంజ్‌లో మంచు ఫ్యామిలీ సభ్యులను అటాడేసుకుంటారు నెటిజన్లు. ఇక మంచు లక్ష్మి మీద వచ్చే ట్రోల్స్‌, విమర్శలకైతే లెక్కే ఉండదు. ఆమె ఏం చేసినా చర్చనీయాంశం అవుతది. కానీ ఇవేం పట్టించుకోకుండా కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ఎప్పుడూ హుందాగా కనిపిస్తుంది.

ఇక ఈ కాంట్రావర్సిలు పక్కన పెడితే..మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఫోటో షూట్స్ కూడా ఎక్కువ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా మంచు లక్ష్మి షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.

వాస్తవానికి మంచు లక్ష్మి తల్లిదండ్రులు, మోహన్‌ బాబు దంపతుల పెళ్లిరోజు ఈరోజు. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేసింది మంచు లక్ష్మి. ఈ ఫొటోల్లో మోహన్‌ బాబు, తన భార్యతో కలిసి ఎంతో సరదాగా చిల్‌ అవుతూ కనిపించారు. అలానే వారితో పాటు మంచు లక్ష్మి, ఆమె కుమార్తె కూడా ఫోటోలు దిగారు.

ఇక తల్లిదండ్రుల ఫొటోలు షేర్‌ చేసిన మంచు లక్ష్మి.. "మీరు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. వైవాహిక జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎలా ఎదుర్కొవాలో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను.అమ్మ మీరు కన్న కలలన్ని నిజం కావాలి.నాన్న మీ కోరికలు అన్ని తీరాలి. ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు.." అంటూ రాసుకొచ్చింది.

ప్రస్తుతం మంచు లక్ష్మి షేర్‌ చేసిన ఈ ఫొటోలు నెట్టింట ఫుల్ వైరల్‌ అవుతున్నాయి. ఇకపోతే ఈ ఫొటోల్లో మోహన్‌ బాబు దంపతుల అన్యోన్యతను చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు.. మీరు ఎప్పుడు ఇలాగే కలిసి మెలసి ఉండాలని కోరుకుంతున్నాము అని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇకపోతే ఇటీవలే మంచు లక్ష్మి పేరు మీడియాలో బాగా ఫుల్ హాట్ టాపిక్ గా మారింది. ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో తెలుగుమ్మాయిల పరిస్థితి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మన దర్శక, నిర్మాతలు ఛాన్స్ ఇవ్వరంటూ చెప్పింది. హాలీవుడ్‌ నుంచి ఇక్కడకు వచ్చి పెద్ద తప్పు చేశానని.. భవిష్యత్తులో అవకాశం వస్తే.. తిరిగి హాలీవుడ్‌కి వెళ్తాను అని చెప్పింది.