మలయాళ పరిశ్రమ వల్లే ఈ స్థాయిలో ఉన్నా!
ఆయన నటన, టాలెంట్ చూసి ఆయనకు ఎన్నో ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వచ్చాయి.
By: Tupaki Desk | 12 March 2025 3:00 PM ISTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మామూలు నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన సూపర్ స్టార్ గా ఎదగడమంటే చిన్న విషయం కాదు. గత 45 ఏళ్లుగా మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మోహన్ లాల్ సూపర్ స్టార్ గా ఎదగడమే కాకుండా ఆ స్టార్‌డమ్ ను నిలబెట్టుకునే సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకెళ్తున్నారు.
ఆయన నటన, టాలెంట్ చూసి ఆయనకు ఎన్నో ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోకుండా మలయాళం ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. అలాగని ఇతర భాషల్లో సినిమాలు చేయలేదని కాదు, వేరే భాషల్లో అప్పుడప్పుడు సినిమాలు చేసినా సొంత ఇండస్ట్రీని మాత్రం ఆయనెప్పుడూ వదల్లేదు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ లాల్ తనకు అంత గుర్తింపు రావడానికి కారణం మలయాళ చిత్ర పరిశ్రమేనని తెలిపారు. మలయాళ సినిమాల్లో నటించడం వల్లే మీకు గుర్తింపు వచ్చిందని ఫీలవుతున్నారా అనే ప్రశ్నకు మోహన్ లాల్ అస్సలు ఆలోచించకుండా అవుననేశారు. తను ఇవాళ ఈ పొజిషన్ ఉన్నానంటే అది మలయాళ సినిమాల వల్లేనని ఆయన తెలిపారు.
మలయాళ ఆడియన్స్ మొదటి నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించేవారిని, అందుకే వేరే భాషల్లో ఛాన్సులు వెతుక్కోకుండా మలయాళంలోనే నటించాలనుకున్నట్టు ఆయన తెలిపారు. ఇతర భాషల్లో ఎన్నో అవకాశాలొచ్చినప్పటికీ వాటి వైపు మొగ్గు చూపలేదని, మల్లూవుడ్ టెక్నికల్ గా కూడా బాగా డెవలప్ అయిందని, మల్లూవుడ్ గొప్ప సినిమాలను నిర్మిస్తుందని ఆయన అన్నారు.
మల్లూ ఆడియన్స్ కు సినిమాలపై ఉన్న ఇష్టం వల్లే ఇక్కడ గొప్ప సినిమాలొస్తున్నాయని చెప్పిన ఆయన కళాత్మక చిత్రాలు నిర్మించడంలో మల్లూవుడ్ ఎప్పుడూ ముందుంటుందని, అందుకే వేరే ఇండస్ట్రీల కంటే మల్లూవుడ్ నుంచి ఎక్కువగా గొప్ప సినిమాలొస్తుంటాయని, అంత గొప్ప ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మరో ఇండస్ట్రీ వైపు చూసే పనేముందని ఆయన ప్రశ్నించారు. ఆయన నటించిన ఎల్2 ఎంపురాన్ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.