Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు ఇండ‌స్ట్రీని షేక్ చేసేలా దిగుతున్నారా?

కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్ క‌థానాయ‌కుడిగా పృధ్వీరాజ్ సుకుమారన్ ద‌ర్శ‌క‌త్వంలో 'లూసీఫ‌ర్' కి సీక్వెల్ గా 'ఎంపురాన్ ఎల్2' రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 March 2025 3:00 AM IST
ఆ ఇద్ద‌రు ఇండ‌స్ట్రీని షేక్ చేసేలా దిగుతున్నారా?
X

కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్ క‌థానాయ‌కుడిగా పృధ్వీరాజ్ సుకుమారన్ ద‌ర్శ‌క‌త్వంలో 'లూసీఫ‌ర్' కి సీక్వెల్ గా 'ఎంపురాన్ ఎల్2' రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. లూసీఫ‌ర్ భారీ విజ‌యం సాధించడంతో ఎంపురాన్ పై భారీ బ‌జ్ క్రియేట్ అయింది. సీక్వెల్ ప్ర‌క‌టించ‌గానే మోహ‌న్ లాల్-సుకుమార‌న్ మ‌రోసారి మ్యాజిక్ చేయ‌డం ఖాయ‌మంటూ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. అందుకు త‌గ్గ‌ట్టే షూటింగ్ పూర్తి చేయ‌డం..టీజ‌ర్ తో అంచ‌నాలు మ‌రింత‌ పెంచేసారు.

అలాగే సినిమాకు మ‌రింత హైప్ తీసుకొచ్చేందుకు డిఫ‌రెంట్ స్ట్రాట‌జీ కూడా అనుస‌రించారు. ఇంట‌ర్ డ‌క్ష‌న్ అనే కొత్త థాట్ తో ప్రాజెక్ట్ పై హైప్ తీసుకొస్తున్నారు. సినిమాలో 36 పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ ప్ర‌త్యేకంగా ఓ వీడియో రిలీజ్ చేయ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. సినిమాలో అంతా హేమా హేమీలే . మోహ‌న్ లాల్, పృధ్వీ, టివినో థామ‌స్, మంజు వారియ‌ర్, సూర‌జ్ , ఇంద్ర‌జిత్, నిఖ‌తా ఖాన్ స్టా,ర్ ల‌తో పాటు విదేశీ న‌టుల్ని కూడా భాగం చేసారు.

'ఎంపురాన్' కి గ్లోబ‌ల్ స్థాయిలో రీచ్ అవ్వాలి అన్న కోణంలో విదేశీ న‌టీన‌టుల్ని రంగంలోకి దించారు. 'గేమ్ ఆఫ్ త్రోన్స్ ' న‌టుడు జేరోమ్ ప్లిన్ బోరిస్ ఓలివ‌ర్ సినిమాలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిల‌వ‌నున్నాడు. అలాగే బ్రిట‌న్ న‌టుడు ఆండ్రియో ట‌వాద‌ర్, ప్రెంచ్ న‌టుడు ఎరిక్ ఎబౌనీ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ పాత్ర‌ల‌కు సంబంధించి సినిమాలో స్పెష‌ల్ ఎలివేష‌న్ సీన్లు డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

సినిమాకి అంత‌ర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాల‌నే ఇలాగే విదేశీ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్నితెరపైకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. మార్చి 27న చిత్రాన్నిరిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం కేవలం మాల‌యాళం తెర‌కెక్కింది. వివిధ భాష‌ల్లో అనువాద రూపంలో రిలీజ్ కానుంది.