కాంతార ఫ్రాంఛైజీలో మోహన్ లాల్?
కేజీఎఫ్ - కాంతారా-సలార్ వంటి విజయవంతమైన ఫ్రాంచైజీలను రూపొందించిన హోంబలే ఫిల్మ్స్ భారతీయ సినిమాలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా స్థిరపడింది.
By: Tupaki Desk | 30 March 2025 3:56 AMకేజీఎఫ్ - కాంతారా-సలార్ వంటి విజయవంతమైన ఫ్రాంచైజీలను రూపొందించిన హోంబలే ఫిల్మ్స్ భారతీయ సినిమాలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా స్థిరపడింది. ఈ సంస్థలో భారీ బడ్జెట్ చిత్రాలకు ఆస్కారం ఉంది. కొత్తదనం నిండిన కథల్ని చెప్పడానికి దర్శకులకు ఛాన్స్ ఉంది. ఇటీవల ప్రముఖ నటుడు మోహన్‌లాల్ నిర్మాణ సంస్థ గురించి ప్రస్థావిస్తూ..కాంతారా: చాప్టర్ 1 లో నటించే అవకాశం ఇస్తారా? అని ప్రస్థావించారు.
ఓ ఇంటర్వ్యూలో కాంతారా: చాప్టర్ 1 లో నటిస్తారా? అని ప్రశ్నించగా, ఈ దశలో తాను సినిమాలో భాగం కాదని మోహన్‌లాల్ స్పష్టం చేశాడు. అయితే కాంతారా 2 లో నన్ను నటించమని అడగండి. నాకు ఒక పాత్ర ఇవ్వండి. నేను చెత్త నటుడిని కాదని అనుకుంటున్నాను! అని పేర్కొంటూ, అతడు చిత్రనిర్మాతలకు నేరుగా విజ్ఞప్తి చేశాడు. హోంబాలే ఫిల్మ్స్ పై మోహన్‌లాల్ కు ఉన్న అభిమానం ప్రత్యేకమైనది. దిగ్గజ నటుడు మోహన్ లాల్‌ని హోంబలే తమ భవిష్యత్ ప్రాజెక్టులలో నటింపజేసే అవకాశం ఉందని దీనిని బట్టి అర్థమైంది.
కాంతారా: చాప్టర్ 1, 2022 పౌరాణిక డ్రామా `కాంతారా`కు ప్రీక్వెల్ మూవీ. బనవాసి కదంబుల పాలనలో సాగే కథాంశమిది. రిషబ్ శెట్టి మానవాతీత శక్తులు కలిగిన నాగ సాధువు పాత్రను పోషిస్తారని సమాచారం. ఈ చిత్రం కథనంలో ప్రత్యేకత, భారతీయ సినిమా స్థాయిని పెంచుతుందని భావిస్తున్నారు. కాంతారా: చాప్టర్ 1 అక్టోబర్ 2, 2025న బహుళ భాషలలో విడుదల కానుంది.దీనితో పాటు హోంబాలే ఫిల్మ్స్ సలార్: పార్ట్ 2 - శౌర్యాంగ పర్వంని నిర్మించేందుకు సన్నాహకాల్లో ఉంది. మోహన్ లాల్ విషయానికి వస్తే... ఎల్ 2: ఎంపురాన్ విజయాన్ని ఆస్వాధిస్తున్నారు.