నేను అతడిలా ప్రొఫెషనల్ కాదన్న సూపర్‌స్టార్
ఒక దక్షిణాది సూపర్‌స్టార్.. ఒక ఉత్తరాది సూపర్‌స్టార్ మధ్య ఈ స్నేహానుబంధం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది.
By: Tupaki Desk | 12 Dec 2024 2:45 AM GMTమోహన్‌లాల్ 3D మలయాళ చిత్రం 'బరోజ్' హిందీ స్క్రీనింగ్‌లో అక్షయ్ కుమార్ - మోహన్‌లాల్ మధ్య సరసం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక దక్షిణాది సూపర్‌స్టార్.. ఒక ఉత్తరాది సూపర్‌స్టార్ మధ్య ఈ స్నేహానుబంధం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది.
ప్రశ్నోత్తరాల సమయంలో అక్షయ్ గురించి ప్రస్థావిస్తూ.. అతడు నటుడిగా గొప్ప ప్రొఫెషనల్ అని మోహన్ లాల్ ప్రశంసించారు. అదే సమయంలో తాను ప్రొఫెషనల్ కాదు అని అంగీకరించారు. ''అతడు తెలివైన నటుడు. గొప్ప సమయపాలన కలిగి ఉంటాడు. అతడు తన వృత్తిని ప్రేమిస్తాడు.. వందశాతం ప్రొఫెషనల్ నటుడు''అని లాల్ స్వయంగా అక్కీని పొగిడేసారు.
మోహన్ లాల్ అంతటి పెద్ద నటుడు ఖిలాడీ అక్షయ్ కుమార్‌ని గొప్పగా ప్రశంసించారు. అక్కీ- లాల్ చాలా ఏళ్లుగా సన్నిహితులు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన చాలా సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేయగా వాటిలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించాడు. అలా వారి మధ్య గొప్ప స్నేహానుబంధం ఉంది.