ఇద్దరు సూపర్ స్టార్స్.. అయినా మల్టీస్టారర్ పై డౌట్ ఎందుకు..?
మలయాళంలో 100 కోట్ల పైన సినిమా అంటే అది వేళ్లతో లెక్క పెట్టేవిగా ఉంటాయి.
By: Tupaki Desk | 22 Dec 2024 4:30 PM GMTమిగతా పరిశ్రమలు సినిమా బడ్జెట్ ని వందల కోట్లు చేస్తుంటే మలయాళ పరిశ్రమ మాత్రం సినిమాకు బడ్జెట్ కన్నా కంటెంట్ ముఖ్యమని ప్రూవ్ చేస్తున్నారు. అందుకే అక్కడ నుంచి వస్తున్న కంటెంట్ ఉన్న సినిమాలు బడ్జెట్ ఎంత అన్నది కూడా చూడకుండా సూపర్ హిట్ చేస్తున్నారు. అక్కడ స్టార్ హీరోల సినిమాలు కూడా చాలా లిమిటెడ్ బడ్జెట్ లో చేస్తారు. ఐతే అక్కడ ఉన్న మార్కెట్ కు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందని తెలిసిందే. మలయాళంలో 100 కోట్ల పైన సినిమా అంటే అది వేళ్లతో లెక్క పెట్టేవిగా ఉంటాయి.
ఐతే మలయాళం నుంచి త్వరలో రాబోతున్న ఒక సినిమా బడ్జెట్ పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మలయాళంలో త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న క్రేజీ మల్టీస్టారర్ మీద భారీ హైప్ ఏర్పడింది. అక్కడ సూపర్ స్టార్స్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టిలు కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి లీడ్ రోల్ లో రాబోతున్న ఈ మల్టీస్టారర్ సినిమాను మహేష్ నారాయణన్ డైరెక్ట్ చేయబోతున్నారు.
థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అనేలా చేస్తున్నారు. అయితే ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నా కూడా సినిమా బడ్జెట్ పై ఇంకా అక్కడ ఇండస్ట్రీలో చర్చలు చేస్తున్నారు. సినిమాకు బడ్జెట్ పెట్టడం వరకు ఓకే కానీ సినిమా అనుకున్న రీచ్ ఉంటుందా అన్న డౌట్ మొదలైంది. మోహన్ లాల్, మమ్ముట్టి ఉన్నా కూడా 100 కోట్ల పైన బడ్జెట్ పెట్టేందుకు భయపడుతున్నారు. ఐతే ఈ సినిమాపై బయట జరుగుతున్న డిస్కషన్స్ అన్నీ చిత్ర యూనిట్ చెవిన పడ్డాయి. సినిమా పై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని వారు చెబుతున్నారు.
ఈ సినిమాకు ఎలాగు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు కానీ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తే తప్పకుండా ఆశించిన స్థాయిలో బిజినెస్ అవుతుంది. మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్స్ కు మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంటుంది. వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉంటాయి. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.