ఎల్2 వాయిదాపై స్పందించిన డైరెక్టర్
ఇదే సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 15 March 2025 2:16 PM ISTకంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్. 2019లో రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఐదేళ్ల తర్వాత లూసిఫర్ కు సీక్వెల్ గా ఎల్2 ఎంపురాన్ తెరకెక్కింది. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశారు. లూసీఫర్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో పాటూ ఇప్పటికే ఎల్2 నుంచి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై ఉన్న ఆసక్తిని ఇంకాస్త పెంచాయి.
ఇదిలా ఉంటే మార్చి 27న రిలీజ్ కానున్న ఎల్2 ఎంపురాన్ గురించి నెట్టింట ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. సినిమా వాయిదా పడిందంటూ కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ లో రూపొందిన ఎల్2 ను కొన్ని రీజన్స్ వల్ల చెప్పిన డేట్‌కు రిలీజ్ చేయడం లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు డైరెక్టర్ పృథ్వీరాజ్ ఇన్‌డైరెక్ట్ గా చెక్ పెట్టారు.
"ఇది కరెక్ట్ టైమ్. అందరూ జాగ్రత్త పడండి. మీ కోసం విలన్ వచ్చేస్తున్నాడు. తాను రెడీగా లేడని ఒప్పించడానికి విలన్ ట్రై చేస్తున్నాడు. అది అతని గొప్ప ట్రిక్" అని పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయనతో పాటూ నిర్మాణ సంస్థ కూడా ఎల్2 ఎంపురాన్ రిలీజ్ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని, ముందు చెప్పినట్టే సినిమాను మార్చి 27న రిలీజ్ చేస్తామని చెప్తోంది.
రీసెంట్ గానే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2 గంటల 59 నిమిషాల రన్ టైమ్ తో సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికెట్ అందుకుంది. మార్చి 27న రిలీజ్ కానున్న ఈ సినిమా మల్లూవుడ్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్2 ఎంపురాన్ తన కెరీర్లో ఓ గొప్ప అధ్యాయమని మోహన్‌లాల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.