Begin typing your search above and press return to search.

కన్నడ గడ్డపై మలయాళ వీరుడు.. ఎంపురాన్ రికార్డుల వర్షం!

మలయాళ ఇండస్ట్రీ నుంచి ఒకే నగరంలో ఈ స్థాయిలో షోలు నమోదు కావడం ఇదే తొలిసారి.

By:  Tupaki Desk   |   26 March 2025 3:51 PM
కన్నడ గడ్డపై మలయాళ వీరుడు.. ఎంపురాన్ రికార్డుల వర్షం!
X

మలయాళ సినిమాలు ఏకంగా బెంగళూరు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయని ఎప్పుడైనా ఊహించామా? కానీ మోహన్‌లాల్ హీరోగా వస్తున్న ఎంపురాన్ (L2:Empuraan) సినిమా కర్నాటక బాక్సాఫీస్‌పై రికార్డుల వేట మొదలు పెట్టి ఊహించని విజయం నమోదు చేయడానికి రెడీ అవుతోంది. హోంబలే ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్‌లో ఈ సినిమా కేవలం బెంగళూరులోనే 1000కి పైగా షోలతో ఓ ఆల్ టైం రికార్డును సెట్ చేయబోతోంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఒకే నగరంలో ఈ స్థాయిలో షోలు నమోదు కావడం ఇదే తొలిసారి.

బెంగళూరు లాంటి మల్టీ లాంగ్వేజ్ మార్కెట్‌లో మలయాళ చిత్రానికి ఈ స్థాయి క్రేజ్ రావడంలో రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది.. మోహన్‌లాల్ అనే పేరు. రెండవది లూసిఫర్ సక్సెస్. ఎంపురాన్ నెగటివ్ స్పేస్‌లో ఉన్న పాలిటికల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని చెప్పడంతో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఇక, హోంబలే ఫిలింస్ లాంటి భారీ సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల బెంగళూరు థియేటర్లు ముందే బుకింగ్ చేసేసాయి.

ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇది కేవలం మలయాళ వెర్షన్‌లోనే సాధించిన ఫీట్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వెర్షన్లు వేరుగా ఉన్నాయి. అంటే ఒక్క భాషలోనే బెంగళూరులో ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఉండటం సినిమాకు ప్యాన్ ఇండియా స్థాయిలో ఎంత క్రేజ్ ఉందో చూపుతోంది. ఇది కేవలం ఓ బిగ్ బడ్జెట్ సినిమా కావడం వల్లనే కాదు, ప్రేక్షకులు ఇప్పుడు ఇంటెలిజెంట్ యాక్షన్ పాలిటికల్ థ్రిల్లర్స్‌కి ఎంతగానో రెస్పాండ్ అవుతారని చెప్పడమే ఈ ట్రెండ్ యొక్క అర్థం.

ఈ క్రేజీ ఓపెనింగ్స్ చూస్తుంటే ఎంపురాన్ మలయాళ సినిమా రేంజ్‌ను కొత్త పీక్స్‌కు తీసుకెళ్లబోతుందని స్పష్టమవుతోంది. బహుశా, ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ వారం కానుంది. 1000 షోలు అంటే కేవలం ఓ టార్గెట్ మాత్రమే కాదు, మలయాళ సినీ మార్కెట్ విస్తృత స్థాయికి వెళ్లే మార్గంలో ఒక కీలక రికార్డ్ గా నిలవబోతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 130 కోట్లు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఇది మలయాళ సినిమా స్టాండర్డ్ ప్రకారం బిగెస్ట్ బడ్జెట్ లెవెల్ అని చెప్పాలి. విశేషమేమిటంటే ఈ బడ్జెట్‌లో మోహన్‌లాల్ రెమ్యూనరేషన్, అలాగే డైరెక్టర్ ప్రథ్వీరాజ్ పేమెంట్స్ లేవు. వీరిద్దరూ చిత్ర విజయానికి సంబంధించిన లాభాల్లో వాటా తీసుకునేలా డీల్ ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. దీని వలన ప్రొడక్షన్ ఖర్చు తగ్గింది కానీ విజయం వస్తే భారీగా లాభాలు వచ్చేలా వ్యూహం రూపొందించారు. ఇది మలయాళ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌కి నాంది పలికే అవకాశం ఉంది.