పేరు లేని ప్రేమ లేఖల స్టోరీ మాది!
కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య కాలంలో తెలుగులోనూ ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 13 Feb 2025 6:40 AM GMTకంప్లీట్ స్టార్ మోహన్ లాల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య కాలంలో తెలుగులోనూ ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. కేవలం మాలీవుడ్ కే పరిమితం కాకుండా ముఖ్యమైన పాత్రలొస్తే? నో చెప్పకుండా నటిస్తున్నారు. దీంతో మోహన్ లాల్ ఇక్కడా బాగా ఫేమస్ అవుతున్నారు. ఇటీవలే డైరెక్టర్ గా కూడా అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. కానీ జస్ట్ మిస్ ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ గా కొనసాగుతారా? లేదా? అన్నది చూడాలి.
ఆ సంగతి సరే మోహన్ లాల్ జీవిత భాగస్వామి సుచిత్ర. తాజాగా మోహన్ లాల్ పెళ్లికి ముందు లవ్ స్టోరీ గురించి రివీల్ చేసారు.` నా పెళ్లికి ముందు విలన్ పాత్రలు పోషించేవాడిని. ఆ సినిమాలు చూసి సుచిత్ర నన్ను ద్వేషిం చేది. ఓకామన్ ప్రెండ్ పెళ్లికి వెళ్లినప్పుడు తొలిసారి ఆమెతో మాట్లాడాను. తను ఎంతగానో నచ్చింది. సుచిత్రకు కూడా నాపై అభిప్రాయం మారింది. పేరు లేకుండా కనీసం ఐదారు ప్రేమలేఖలు రాసేది.
నేను వాటిని జాగ్రత్తగా దాచేవాడిని. కొన్నాళ్లకు నన్ను ప్రేమిస్తున్న విషయం వాళ్ల అమ్మనాన్నలకు చెప్పేసింది.
ఆ తర్వాత పెద్దవాళ్లు ఖాయం చేసారు. అటుపై ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాం అన్న విషయాన్ని పంచు కున్నాం. అంత వరకూ మనసులో ప్రేమ ఉన్నా? ఎవరూ ఓపెన్ కాలేదు. అలా 30 ఏళ్ల క్రితం నాజీవితంలో సుచిత్ర వచ్చింది. అప్పుడు నన్ను సుచిత్ర `సుందర కట్టప్పన్` అని పిలిచేది. అంటే అందమైన అబ్బాయి అని అర్దం. అప్పటి నుంచి ఇద్దరు జీవితాలు సంతోషంగా సాగిపోతున్నాయి` అని తెలిపారు.
ప్రస్తుతం మోహన్ లాల్ ఏడు సినిమాల్లో నటిస్తున్నాడు. అవన్నీ కూడా ఇదే ఏడాది రిలీజ్ అవుతాయి. గత ఏడాది కేవలం రెండు చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈనేపథ్యంలో 2025లో గత ఏడాదిని కూడా బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. భారతదేశంలో ఏడాదిలో అత్యధిక సినిమాలు రిలీజ్ చేసే ఏకైక స్టార్ మోహన్ లాల్ అన్న సంగతి తెలిసిందే.