ట్రైలర్ : సీనియర్ జోడీ మధ్య రొమాంటిక్ కామెడీ!
మాలీవుడ్ లో హిట్ చిత్రం కావడంతో? ఆ బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుంది.
By: Tupaki Desk | 27 March 2025 5:29 AMకంప్లీట్ స్టార్ మోహన్ లాల్ తెలుగు హీరోల్లో ఒకరిగా మారిపోయారు. కొంత కాలంగా ఆయన నటిస్తోన్న మలయాళ చిత్రాలు తెలుగులోనూ క్రమం తప్పకుండా అనువాదమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించడంతో? ఆయన మలయాణ చిత్రాలకు తెలుగులో క్రేజ్ పెరుగుతోంది. `లూసీఫర్` చిత్రాన్ని చిరంజీవి `గాడ్ ఫాదర్` టైటిల్ తో రీమేక్ చేయడం అన్నది మోహన్ లాల్ కి బాగా కలిసొచ్చింది.
మాలీవుడ్ లో హిట్ చిత్రం కావడంతో? ఆ బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. ఈ నేపథ్యంలో 'ఎంపురాన్ ఎల్-2'ని తెలుగు సహా పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలున్నాయి. దిల్ రాజు రిలీజ్ చేస్తుండటంతో మరింత బజ్ క్రియేట్ అవుతుంది. ఈ నేపథ్యంలో మోహన్ లాల్ స్వభాషా చిత్రం తుడరమ్ అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టాలీవుడ్ లోనూ ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఈ సినిమా మాలీవుడ్ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లో కామెడీని ఓ రేంజ్ లో హైలైట్ చేసారు. సీనియర్ నటి శోభన-మోహన్ లాల్ రొమాంటిక్ ఎపిసోడ్ అంతే హైలైట్ అవుతుంది. రొమాన్స్ కి వయసుతో సంబంధం లేదని ఈ కథలోనూ భార్యాభర్తల మధ్య రొమాంటిక్ కామెడీ ట్రై చేసినట్లు కని పిస్తుంది. షణ్ముగం పాత్రలో మోహన్ లాల్...లలిత పాత్రలో శోభన నటన ఆకట్టుకుంటుంది. ఆర్ ఆర్ సన్నివేశాలకు పర్పెక్ట్ గా సింక్ అయింది.
ట్రైలర్ క్లైమాక్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ని రివీల్ చేసారు. యాక్షన్..రొమాన్స్ ...కామెడీ అంశాల్ని మేళవించి తరుణ్ మూర్తి తెరకెక్కించారు. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇంకా రిలీజ్ తేదిని ప్రకటించలేదు. మాతృకలో చిత్రాన్ని రెజపుత్ర విజువల్ మీడియా నిర్మిస్తుంది. మరి ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి ఎంపురాన్ భారీ విజయం సాధిస్తే తెలుగు అనువాదమయ్యే అవకాశం ఉంది.