సోనీ స్టూడియో నుంచి క్రేజీ అప్ డేట్!
దీంతో అతడి డెబ్యూకి ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లనే రంగంలోకి దించారు. ఈ చిత్రానికి జిజో పున్నూస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
By: Tupaki Desk | 10 Feb 2024 7:28 AM GMTకంప్లీట్ స్టార్ మోహన్ లాల్ అంటే ఏడాదికి కనీసం నాలుగు సినిమాలైనా రిలీజ్ అవ్వాల్సిందే. గత ఏడాది ని మోహన్ లాల్ సంతోషంగానే ముగించారు. కొత్త ఏడాదిని అంతే సంతోషంగా మొదలు పెట్టారు. కానీ ఏడాది ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన 'మలైకోటి వాలిబన్' వాటిని అందుకోవడంలో విఫలమైంది. పీరియాడిక్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన సినిమాలో మోహన్ లాల్ డిఫరెంట్ గెటప్ తో ఆకట్టుకున్నా బాక్సాఫీస్ వద్ద ఫలతం మాత్రం నిరాశ పరిచింది.
దీంతో తదుపరి సినిమా 'బరోజ్: గార్డియన్ ఆఫ్ డిగామాస్ ట్రెజర్' తో అన్ని లెక్కలు సరిచేయాలని కాన్పిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాతో ఆయన మెగా ఫోన్ పట్టడం విశేషం. మోహన్ లాల్ స్వీయా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. దీంతో అతడి డెబ్యూకి ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లనే రంగంలోకి దించారు. ఈ చిత్రానికి జిజో పున్నూస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. హాలీవుడ్ సంగీత దర్శకుడు మార్క్ కిలియన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఇదొక ఫాంటసీ చిత్రంగా రూపొందుతుంది.
ఇందులో మోహన్‌లాల్ 'డి' గామాకు చెందిన పురాతన నిధికి కాపలా ధారి పాత్ర పోషిస్తున్నాడు. దాని రక్షణ కోసం తన వారసుడిని ఎంపిక చేయడమే సినిమా కథగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి మార్చి 28న రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సినిమా అప్ డేట్స్ ని మోహన్ లాలా అందించారు. హాలీవుడ్‌లోని సోనీ స్టూడియోస్ నుంచి ఓ చిత్రాన్ని పోస్ట్ చేసి అప్ డేట్ ఇచ్చారు. ప్రఖ్యాత మ్యూజిక్ స్టూడియో సోనీలో సినిమాకి సంబంధించిన ఆడియో ఫైన్-ట్యూనింగ్ వర్క్ జరుగుతోందని తెలిపారు. మార్క్ కిలియన్ -జోనాథన్ మిల్లర్‌లతో కలిసి ఉన్న ఫోటోని పంచుకున్నారు. దీన్ని ఓ త్రీడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.