ఆ స్టార్ హీరోకి మళ్లీ పరాభవం తప్పలేదా!
గతేడాది వరుస విజయాలతో కంప్లీట్ స్లార్ మోహన్ లాల్ పుల్ స్వింగ్ లో దూసుకుపోయారు.
By: Tupaki Desk | 27 Jan 2024 9:41 AM GMTగతేడాది వరుస విజయాలతో కంప్లీట్ స్లార్ మోహన్ లాల్ పుల్ స్వింగ్ లో దూసుకుపోయారు. ఆయన సోలో చిత్రాలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి `జైలర్` లాంటి సినిమాలోనూ భాగమవ్వడం అది ఏకంగా 600 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో మరోసారి మోహన్ లాల్ పేరు నెట్టింట సంచలనమైంది. ఆ రకంగా 500 కోట్ల క్లబ్ సినిమాలో భాగమైన తొలి మలయాళ స్టార్ గా రికార్డు సృష్టించారు.
తమిళ సినిమా అయినా అందులో అగ్ర తారలు భాగమవ్వడంతోనే సినిమాకి ఆ వసూళ్లు సాధ్యమ య్యాయి. ఆ రకంగా మోహన్ లాల్ కి గత ఏడాది బాగానే కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో అదే రెట్టించిన ఉత్సాహంతో 2024 లోకి అడుగుపెట్టారు. దీంతో తొలి చిత్రంగా ఆయన కథానాయకుడిగా నటించిన `మలైకోట్టై వాలిబన్` 25న భారీ అంచనాల మధ్య థియేటర్లో రిలీజ్ అయింది. తెలుగులో కూడా అదే తేదీన రిలీజ్ కావాలి. కానీ థియేటర్ల సర్దుబాటు సమస్య తలెత్తడంతో వాయిదా వేసారు.
ఇక ఈ సినిమాపై రిలీజ్ కి ముందు ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. పీరియాడిక్ సినిమా కావడం తో పాటు భారీ బడ్జెట్ తో నిర్మాణమైన సినిమా ఇది. మోహన్ లాల్ లుక్ సహా చాలా పాత్రల ఆహార్యం చూసి మాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతోన్న మరో డిఫరెంట్ అటెంప్ట్ గా సంచలనమైంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ రిలీజ్ అయిన తర్వాత అవన్నీ ఒక్కసారిగా తుస్సుమన్నట్లే కనిపిస్తుంది. సినిమాకి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.
బిల్డప్ ఎక్కువ....బిజినెస్ తక్కువ అన్నట్లు సినిమాలో హడావుడి తప్ప ఏం లేదని తేల్చేసారు రివ్యూ రైటర్లు. ఆర్ట్ వర్క్..కోట్ల రూపాయల ఖర్చు.. కళ్ళు చెదిరే సాంకేతిక నిపుణుల పనితనం ఇవన్నీ నాసిర కంగానే కనిపిస్తున్నాయి. మేకింగ్ పరంగానూ ఏమంత గొప్పగా లేదనే విమర్శలొస్తున్నాయి. దర్శకుడు లిజో జోస్ పెల్లిషెర్రీ మేకింగ్ అంతా పేలవంగానే ఉన్నాయి. తొలిరోజు సినిమా 15 కోట్ల వరకూ రాబట్టినా టాక్ తో ఒక్కసారిగా వసూళ్లు డల్ అవుతున్నాయి.
రిపబ్లిక్ డే సెలవు దినమైన థియేటర్లు ఖాళీగానే కనిపించాయి. ఇంతకు ముందు మోహన్ లాల్ ఇదే తరహా ప్రయత్నం చేసారు. `మరక్కార్ అరేబియా సముద్ర సింహం` టైటిల్ తో రిలీజ్ అయింది. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మాణమైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. తాజాగా కంప్లీట్ స్టార్ చేసిన మరో ప్రయ త్నం కూడా అలాగే నిరాశ పరుస్తుంది.