Begin typing your search above and press return to search.

మోక్షు బాబు డెబ్యూ.. ఇంకా ఎంత కాలం?

హనుమాన్ మూవీతో ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ డెబ్యూ మూవీని తెరకెక్కించనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Feb 2025 9:26 AM GMT
మోక్షు బాబు డెబ్యూ.. ఇంకా ఎంత కాలం?
X

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం.. అటు నందమూరి అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఎంతో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మోక్షు బాబు డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినా.. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. జస్ట్ ఓ పోస్టర్ తో ప్రకటన మాత్రమే వచ్చింది.

హనుమాన్ మూవీతో ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ డెబ్యూ మూవీని తెరకెక్కించనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అది జరిగి ఆరు నెలలు దాటుతున్నా.. ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఆ మధ్య సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.

ఆ తర్వాత ప్రశాంత్ వర్మ కాదని.. మోక్షజ్ఞ డెబ్యూ డైరెక్టర్ ఈయనే అంటూ పలువురు పేర్లు కూడా వినిపించాయి. బాలయ్య స్వయంగా పరిచయం చేస్తారని కూడా టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు నెట్టింట క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ వర్మ మూవీతో మోక్షు బాబు ఎంట్రీ ఇస్తారని.. కానీ కాస్త టైమ్ పడుతుందని తెలుస్తోంది.

ఎందుకంటే ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు జై హనుమాన్ మూవీ పనులతో బిజీగా ఉన్నారు. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హనుమాన్ మూవీకి సీక్వెల్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం జై హనుమాన్ మూవీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆ సినిమా కంప్లీట్ అయ్యాక.. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మూవీ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ విషయాన్ని బాలయ్యకు చెప్పగా.. ఆయన ఓకే చెప్పేశారట. దీంతో ఇప్పుడు జై హనుమాన్ ను పూర్తి చేస్తున్నారు ప్రశాంత్. అదే సమయంలో మోక్షు బాబు.. యాక్టింగ్ తోపాటు వివిధ విభాగాల్లో ట్రైనింగ్ తీసుకోనున్నారని సమాచారం.

మొత్తానికి మోక్షు డెబ్యూ మూవీకి సంబంధించిన అప్డేట్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అయితే జై హనుమాన్ పూర్తవ్వడానికి మరికొన్ని నెలల సమయం కచ్చితంగా పడుతుంది. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాజెక్ట్. 2025 చివరికల్లా పూర్తి చేయాలని ప్రశాంత్ వర్మ ఫిక్స్ అయ్యారట. దీంతో మోక్షు ఫస్ట్ మూవీ 2026లోనే రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..