Begin typing your search above and press return to search.

ఆలస్యంలో మోక్షజ్ఞ రికార్డ్.. వర్మకు పెద్ద ఛాలెంజే!

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Sep 2024 9:30 PM GMT
ఆలస్యంలో మోక్షజ్ఞ రికార్డ్.. వర్మకు పెద్ద ఛాలెంజే!
X

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు డెబ్యూ మూవీ చేయనున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్ గా రానున్న మోక్షజ్ఞ తొలి సినిమాను ఎస్ఎల్‌వీ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మించనున్నారు.

అయితే ఇదంతా బాగానే ఉన్నా.. తెర వెనుక జరిగిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చెప్పాలంటే మోక్షు సినీ ఎంట్రీ అదిగో.. ఇదిగో అంటూ ఇప్పుడు జరిగింది. అభిమానులను ప్రతిసారి ఊరించి ఉసూరుమనిపించారు. కానీ బాలయ్య మాత్రం బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను ఎప్పుడో స్టార్ చేసేశారు. ఎనిమిదేళ్ల క్రితం నుంచే తన కుమారుడి ఎంట్రీ కోసం ఆలోచిస్తున్నారు. స్టోరీ అండ్ డైరెక్టర్ కోసం అనేక చర్చలు జరిపారు.

ఏదేమైనా ఫైనల్ గా 30వ ఏడాదిలో సినీ ఎంట్రీ ఇస్తున్నారు మోక్షు. అయితే సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎందరో వారసులు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఒక బిగ్ ఫ్యామిలీ నుంచి చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన హీరో మాత్రం మోక్షజ్ఞ అనే చెప్పాలి. నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న సహా అందరూ రెండు పదుల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చేశారు. కానీ మోక్షజ్ఞ.. లేట్ బట్ నాట్ లీస్ట్.. అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఏజ్ 30 అయినా.. మోక్షు లుక్స్ మాత్రం పాతికేళ్ల కుర్రాడు తరహాలోనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం లావుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు చాలా చాలా చేంజ్ అయ్యారు. చెప్పాలంటే బాగా సన్నబడ్డారు. అందుకు బాలయ్య అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పర్సనల్ ట్రైనర్ తో పాటు యాక్టింగ్, ఇతర విభాగాల్లో మోక్షును రాటు తేల్చేందుకు స్పెషల్ టీమ్‌ను బాలయ్య రంగంలోకి దించారని జోరుగా టాక్ వినిపిస్తోంది.

అయితే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్టర్ గా ఎందరి పేర్లో వినపడ్డాయి. వినాయక్, బోయపాటి శీను, అనిల్ రావిపూడిలో ఒకరితో మోక్షు ఫస్ట్ సినిమా చేయనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఓపెన్ గా చెప్పాలంటే.. అప్పటికి ప్రశాంత్ వర్మ తొలి సినిమా రిలీజ్ కూడా కాకపోయి ఉంటుంది. అయితే అన్ స్టాపబుల్ షో కోసం ప్రశాంత్ వర్మ వర్క్ చేశారు. అప్పుడు బాలయ్యకు ప్రశాంత్ వర్మ ఓ స్టోరీ లైన్ చెప్పగా.. అది నచ్చేసిందట.

ఆ తర్వాత హనుమాన్ మూవీ వచ్చింది. దీంతో ప్రశాంత్ వర్మపై నమ్మకంతో బాలయ్య కుమారుడిని ఆయన చేతిలో పెట్టారట. కానీ ఇప్పుడు వర్మకు కెరీర్ లో అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. హనుమాన్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు బాలయ్య వారసుడిని ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేయాలి. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే కామెంట్స్ వచ్చేస్తాయి. కాబట్టి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. ప్రశాంత్ వర్మకు పెద్ద భారమే. మరేం చేస్తారో చూడాలి.