Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ.. ఆమె కూతురు ఫిక్స్ అయినట్లేనా..

అదే సమయంలో ఆయన తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 2:41 PM GMT
మోక్షజ్ఞ.. ఆమె కూతురు ఫిక్స్ అయినట్లేనా..
X

నందమూరి బాలకృష్ణ.. దాదాపు నలభై ఏళ్లుగా సినీ రంగంలో తనదైన మార్కును చూపిస్తూ దూసుకెళ్తోన్న ఆయన.. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫామ్‌తో ముందుకెళ్తున్నారు. ఈ ఉత్సాహంలోనే మరిన్ని ప్రాజెక్టులను చేస్తున్నారు. అదే సమయంలో ఆయన తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయబోతున్నారు.


నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశం గురించి చాలా కాలంగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలయ్య ప్రకటించారు. ఆ తర్వాత మోక్షజ్ఞ మొదటి ప్రాజెక్టు గురించి, దాన్ని డైరెక్ట్ చేయబోయే దర్శకుడి గురించి కూడా ఎన్నో ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే అతడి ఫస్ట్ మూవీపై ప్రకటన వచ్చింది.

మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోయే ప్రాజెక్టును టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నందమూరి తేజస్విని సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌తో పాటు కాస్టింగ్ మీద ప్రశాంత్ వర్మ ఫోకస్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది.

ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ చేయబోయే సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్న దానిపై కూడా చాలా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో అతడికి జోడీగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తుందని, ఇప్పటికే బోనీ కపూర్‌తో ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపాడని న్యూస్ వచ్చింది. కానీ, దీనిపై ఆ తర్వాత ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు.

నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్న మొదటి సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తాజాగా మరొక గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో మోక్షజ్ఞకు జోడీగా సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడాని నటిస్తుందట. ఇప్పటికే ఆమె ఆడిషన్స్ కూడా ఇచ్చిందని, ప్రశాంత్ వర్మ ఈ భామకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది.

రషా తడాని గతంలోనే టాలీవుడ్‌లోకి వస్తుందని టాక్ వచ్చింది. కానీ, అది జరగలేదు. ఇప్పుడు మాత్రం మోక్షజ్ఞ సినిమాతో ఆమె తెలుగులోకి అడుగు పెడుతుందని జోరుగా ప్రచారమే జరుగుతోంది. ఇదిలా ఉండగా.. రషా తడాని తల్లి రవీనా టాండన్.. నందమూరి బాలకృష్ణతో ‘బంగారు బుల్లోడు’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.