Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ సినిమా.. ఈ వివరాలు తెలుసా..?

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా ఫిక్స్ అయ్యింది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 11:30 AM GMT
మోక్షజ్ఞ సినిమా.. ఈ వివరాలు తెలుసా..?
X

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. ఈమధ్యనే మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా తొలి సినిమా ప్రకటన వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. సినిమా కథ పురణాల టచ్ ఉంటుందని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ అభిమన్యుడిగా కనిపిస్తాడని టాక్. హనుమాన్ తో తన సత్తా చాటిన ప్రశాంత్ వర్మ తనకు కూడా కల్కి లాంటి సినిమా హ్యాండిల్ చేసే సత్తా ఉందని ప్రూవ్ చేసుకునేందుకే ఇలాంటి కథ ఎంచుకున్నాడు.

ఇక మోక్షజ్ఞ తొలి సినిమా ముహూర్త కార్యక్రమాలు డిసెంబర్ 2న జరుగుతాయని టాక్. సినిమా పూజా కార్యక్రమం రోజు దాదాపు ఇండస్ట్రీ పెద్దలంతా హాజరవుతారని తెలుస్తుంది. మోక్షజ్ఞ తొలి సినిమా హీరోయిన్ గా రవీనా టాండన్ కూతురు రషా తథానీని ఫైనల్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు ప్రతినాయకుడిగా రానా పేరు వినిపిస్తుంది. ఐతే రానా ఆల్రెడీ రెండు సినిమాలు కమిట్ అయ్యాడు కాబట్టి మోక్షజ్ఞతో కలిసి నటించడం కష్టమని తెలుస్తుంది.

అంతేకాదు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ తొలి సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో నందమూరి నట సింహం బాలకృష్ణ కూడా భాగం అవుతారని తెలుస్తుంది. వారసుడి తొలి సినిమాలో బాలయ్య బాబు కూడా చిన్న కేమియో రోల్ చేయబోతున్నారని టాక్. ఆ పాత్ర సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా చేస్తుందని అంటున్నారు. బాలయ్య బాబు గెస్ట్ రోల్ చేస్తున్నాడు అంటే ప్రశాంత్ వర్మ పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని చెప్పొచ్చు.

మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా డిసెంబర్ 2 న పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత రెగ్యులర్ షూట్ కి వెళ్తారని తెలుస్తుంది. సినిమాను 2025 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు గ్రాఫిక్స్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ లో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఉండబోతుందని దాన్ని స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

నందమూరి వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులు మోక్షజ్ఞ తొలి సినిమా కోసం సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. వారి అంచనాలకు తగినట్టుగానే సినిమా గురించి ఒక్కో అప్డేట్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.