Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ డెబ్యూ - మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలైంది!

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Dec 2024 9:07 AM GMT
మోక్షజ్ఞ డెబ్యూ - మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలైంది!
X

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. అయితే షూటింగ్ ప్రారంభం అవ్వాల్సిన రోజే సినిమా ఆగిపోయింది. మోక్షజ్ఞకి హెల్త్ బాగోలేకపోవడంతో షూటింగ్ వాయిదా పడిందని బాలకృష్ణ మీడియాతో చెప్పారు. కానీ ఈ ప్రాజెక్ట్ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకొని క్యాస్టింగ్ కూడా ఫైనల్ చేసాక ఏవో కారణాల వలన ఈ చిత్రం క్యాన్సిల్ అయ్యిందని అనుకుంటున్నారు. కారణాలు ఏంటనేది బయటకి రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ మరో ఇద్దరు దర్శకులని లైన్ లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో మోక్షజ్ఞ ఒక సినిమాకి కమిట్ అయ్యాడంట.

అలాగే సితార ఎంటెర్టైన్మెంట్స్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాకి ఒకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ లలో ఏది మొదటిగా స్టార్ట్ అవుతుందనేది క్లారిటీ లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే నాగ్ అశ్విన్ ప్రస్తుతం ‘కల్కి 2898ఏడీ పార్ట్ 2’పైన ఫోకస్ చేశారు. ఈ సినిమా 2025లోనే పట్టాలు ఎక్కనుంది.

ఇది పూర్తి చేసిన తర్వాతనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా చేసే అవకాశం ఉంది. అయితే ‘కల్కి పార్ట్ 2’ కంటే ముందు మోక్షజ్ఞని ఇంటర్ డ్యూస్ చేసే బాధ్యత నాగ్ అశ్విన్ తీసుకునే అవకాశం ఉండొచ్చని కూడా అనుకుంటున్నారు. అది ఎంత వరకు సాధ్యం అవుతుందో తెలియదు. దీంతో పాటు ‘ఆదిత్య 369’ సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ మూవీ కూడా మోక్షజ్ఞతో చేయాలని బాలకృష్ణ అనుకుంటున్నారు.

ఇది కచ్చితంగా ఉంటుందని బాలకృష్ణ చెప్పారు. కానీ ఎప్పుడు మొదలవుతుందనేది క్లారిటీ లేదు. ప్రశాంత్ వర్మ మూవీ క్యాన్సిల్ అయితే మాత్రం మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం కచ్చితంగా మరో రెండేళ్లు ఎదురుచూడాల్సి రావొచ్చని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ తర్వాత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. అతను చెప్పిన లైన్ ఒకే అయితే త్వరలో సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏది ముందు మొదలు కావాలన్నా కూడా బాలయ్య నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటున్నారు.