Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ.. ఆ టైమ్ వచ్చిందంటూ!!

హనుమాన్ మూవీతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా నటించిన ఆ సినిమాతో తన సత్తా ఏంటో చూపించారు.

By:  Tupaki Desk   |   5 Sep 2024 8:38 AM GMT
ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ.. ఆ టైమ్ వచ్చిందంటూ!!
X

హనుమాన్ మూవీతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా నటించిన ఆ సినిమాతో తన సత్తా ఏంటో చూపించారు. పాన్ ఇండియా లెవెల్ లో అనేక రికార్డులు బద్దలు కొట్టిన హనుమాన్ మూవీ.. భారీ వసూళ్లు సాధించింది. మేకర్స్ కు పెద్ద ఎత్తున లాభాలు కురిపించింది. ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభించారు.


హనుమాన్ తర్వాత తన (PVCU) యూనివర్స్ లో కొత్త చిత్రాలు చేస్తున్నట్లు వెల్లడించారు ప్రశాంత్ వర్మ. అయితే ఆయన.. ఇటీవల ఛాలెంజ్ ను స్వీకరించినట్లు ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత సింహం తన పిల్లను ఎత్తుకున్న పిక్ ను షేర్ చేశారు. సింబా ఈజ్ కమింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి త్వరలో కొత్త తేజస్సు రానుందని ట్వీట్ పెట్టారు. దీంతో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసమే ఆయన హింట్ ఇచ్చారని అంతా ఫిక్స్ అయ్యారు.

మళ్లీ ఈరోజు మార్నింగ్.. 1.33 PM సింబా ఈజ్ కమింగ్ అంటూ పోస్ట్ పెట్టారు. చెప్పినట్లు.. ప్రశాంత్ వర్మ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం వచ్చింది.. సింబా ఈజ్‌ కమింగ్‌.. PVCU2 ప్రకటన రేపు ఉదయం 10:36 గంటలకు అని ట్వీట్ చేశారు. దాంతోపాటు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో కొండలు, సూర్యుడిని చూపించారు. పోస్టర్ చాలా నేచురల్ గా డిజైన్ చేశారని నెటిజన్లు చెబుతున్నారు.

అయితే బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఈ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా చేయనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ పోస్టులు పెడుతున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. రేపు(సెప్టెంబర్ 6) మోక్షు బాబు పుట్టినరోజు కనుక.. ప్రశాంత్ వర్మ మూవీ అనౌన్స్మెంట్ చేయనున్నారని చెబుతున్నారు.

వెయిటింగ్ ఫర్ అనౌన్స్మెంట్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో మోక్షు, ప్రశాంత్ వర్మ మూవీ తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు సమాచారం. గాండీవ అనే టైటిల్ అనుకున్నట్టు టాక్. మరి ప్రశాంత్ వర్మ.. మోక్షు బాబు కోసం ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారో? ప్రేక్షకులను ఎలా అలరించనున్నారో వేచి చూడాలి.