Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ ఎంట్రీ… మన పాన్ ఇండియా డైరెక్టర్ ఫిక్స్

నందమూరి బాలయ్య వారసుడిగా టాలీవుడ్ లోకి నందమూరి మోక్షజ్ఞ అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   12 July 2024 4:03 AM GMT
మోక్షజ్ఞ ఎంట్రీ… మన పాన్ ఇండియా డైరెక్టర్ ఫిక్స్
X

నందమూరి బాలయ్య వారసుడిగా టాలీవుడ్ లోకి నందమూరి మోక్షజ్ఞ అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోక్షజ్ఞ హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడానికి కావలసిన యాక్టింగ్ స్కిల్స్, డాన్స్, ఫైట్స్ లాంటివి నేర్చుకున్నారు. బాలకృష్ణ కూడా చాలా కాలంగా మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయడం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ గా మారి తెరంగేట్రం కోసం సిద్ధమయ్యాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం దర్శకుడి వేట మొదలైంది. చాలామంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందనే ప్రచారం నడిచింది. అలాగే అనిల్ రావిపూడి పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు.

రణవీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరో మూవీ చేయాలని భావించాడు. అయితే ఇది ఎందుకనో సెట్స్ పైకి వెళ్ళడానికి ముందే ఆగిపోయింది. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు అఫీషియల్ గా బయటికి చెప్పారు. మరోవైపు ప్రశాంత్ వర్మ హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కించాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో లీడ్ రోల్ అయిన హనుమాన్ పాత్ర కోసం హీరో వేటలో పడ్డారు.

చాలామంది టాలీవుడ్ హీరోల పేర్లు హనుమాన్ క్యారెక్టర్ కోసం వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఏది కూడా ఖరారు కాలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే బాధ్యత ప్రశాంత్ వర్మకి బాలకృష్ణ అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ కూడా మోక్షజ్ఞతో పవర్ ఫుల్ సూపర్ హీరో స్టోరీ చేయాలని రెడీ అవుతున్నాడంట. ఈ సినిమాని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నిర్మించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

త్వరలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందంట. మోక్షజ్ఞ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో తన ఇంట్రడక్షన్ గురించి కన్ఫర్మ్ చేశాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ చేస్తే కచ్చితంగా అది బ్లాక్ బాస్టర్ అవుతుందని నందమూరి బాలయ్య అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. ఆ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది వేచి చూడాలి.