Begin typing your search above and press return to search.

లైంగిక ఆరోప‌ణ‌ల కేసులో న‌టుడుకి ముందస్తు బెయిల్!

అత్యాచారం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న సిద్దీఖి అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.

By:  Tupaki Desk   |   19 Nov 2024 12:03 PM GMT
లైంగిక ఆరోప‌ణ‌ల కేసులో న‌టుడుకి ముందస్తు బెయిల్!
X

మ‌ల‌యాళ న‌టుడు సిద్దీకి భారీ ఊర‌ట ల‌భించింది. అత్యాచారం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న సిద్దీఖి అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. సిద్దీఖి పై ఫిర్యాదు చేయ‌డానికి ఇంత జాప్యం ఎందుకు జ‌రిగింద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. ఈ కార‌ణంతోనే బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు పేర్కోంది. కానీ అవ‌స‌రం మేర పోలీసుల విచార‌ణ‌కు సిద్దీకి స‌హ‌క‌రించాల‌ని సూచించింది. అలాగే త‌న పాస్ పోర్ట్ ను ట్ర‌య‌ల్ కోర్టులో డిపాజిట్ చేయాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది.

ఆల‌స్యానికి గ‌ల కార‌ణాన్ని బాధితురాలి త‌రుపు న్యాయవాది ఇలా చెప్పుకొచ్చారు. హేమ క‌మిటీ నివేదిక‌ను విడుద‌ల చేయ‌డం.. ఆపై కేర‌ళ హైకోర్టు జోక్యం చేసుకున్న త‌ర్వాతే అత్యాచార బాధితురాలు ఫిర్యాదు చేయ‌డానికి ధైర్యం వ‌చ్చింద‌ని త‌న వాద‌న వినిపించారు. అయినా ధ‌ర్మాస‌నం ఆ వాద‌న‌ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా బెయిల్ మంజూరు చేసింది. ఆ మ‌ధ్య జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో చాలా మంది మాలీవుడ్ న‌టీనుట‌ల‌పై లైంగిక ఆరోప‌ణ‌లు కేసులు న‌మోద‌య్యాయి. దీంతో అమ్మా అసోసియేష‌న్ కూడా ర‌ద్దయింది. సంఘంలో ఉన్న వారంతా స్వ‌చ్ఛందంగా త‌మ ప‌దవులకు రాజీనామా చేయ‌డంతో అసోసియేష‌న్ ర‌ద్ద‌యింది. 2016 తిరువ‌నంత పురం మ‌స్క‌ట్ హోట‌ల్ లో సిద్దిఖీ అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని బాధితురాలు పిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసారు.

ఫేస్ బుక్ ద్వారా ప‌రిచ‌య‌మైన సిద్దీఖి సినిమా అవ‌కాశం పేరుతో వంచించాడ‌ని...కోరిక తీర్చాల‌ని బ‌ల‌వంతం చేసిన‌ట్లు ఫిర్యాదు లో పేర్కొంది. అందుకు తాను నిరాక‌రించ‌డంతోనే ప‌థ‌కం ప్ర‌కారం హోట‌ల్ లో అత్యాచారం చేసిన‌ట్లు న‌టి రేవ‌తి తెలిపింది. అయితే కేసు న‌మోద‌వ్వ‌డంతో సిద్దీకీ అరెస్ట్ భ‌యంతో ప‌రార‌య్యాడు. అప్ప‌టి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఈనేప‌థ్యంలో సుప్రీంకోర్టులో ముందొస్తు బెయిల్ పిటీష‌న్ వేసుకోవ‌డం ...విచార‌ణ‌కు రావ‌డం.. బెయిల్ మంజూరు అవ్వ‌డం జ‌రిగింది.