పట్టు చీరలో సంయుక్త.. సో గోర్జియస్ గురూ!
మాలీవుడ్ బ్యూటీ సంయుక్త మీనన్ కు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 16 Dec 2024 2:30 AM GMTమాలీవుడ్ బ్యూటీ సంయుక్త మీనన్ కు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. వరుస హిట్స్ అందుకోవడం వల్ల గోల్డెన్ బ్యూటీ అనే ట్యాగ్ ను దక్కించుకున్నారు.
మాలీవుడ్ మూవీ పాప్ కార్న్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటించారు. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు. మూడేళ్ల క్రితం ఎరిడ చిత్రంతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏడాది తెలుగు సినీ ప్రియులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీతో పలకరించారు సంయుక్త.
అందులో టాలీవుడ్ హల్క్ రానా భార్యగా కనిపించి మెప్పించారు. తన అందం, అభినయంతో అలరించారు. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ బింబిసారలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు. ఆ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అదే ఏడాది గాలిపట -2 మూవీతో శాండల్ వుడ్ లోకి కూడా సంయుక్త ఎంట్రీ ఇచ్చారు.
ఇక బింబిసార హిట్ తో తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారు. సార్ మూవీతో ఆమె కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పాలి. అందులో తన నటనతో ఫిదా చేశారు. ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ విరూపాక్షతో కెరీర్ లోనే ది బెస్ట్ హిట్ ను అందుకున్నారు. అనంతరం డెవిల్ లో నటించినా.. అనుకున్న స్థాయిలో హిట్ సాధించలేకపోయారు.
ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ హీరో నిఖిల్ తో స్వయంభూ సినిమా చేస్తున్నారు. శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ తో చెరో చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. వాటితో పాటు మరికొన్ని మూవీలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సినిమాలతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు.
ఎప్పటికప్పుడు పర్సనల్ తోపాటు కెరీర్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. కొత్త కొత్త పిక్స్ ను పోస్ట్ చేస్తుంటారు. ఎక్కువగా చీరల్లో దిగిన ఫోటోస్ ను షేర్ చేస్తుంటారు. ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మాయ చేస్తుంటారు. సింపుల్ అండ్ ప్లెయిన్ శారీస్ లో ఎక్కువగా ఫోటో షూట్ చేసి తన ఫ్యాన్స్ కు ట్రీట్స్ ఇస్తుంటారు అమ్మడు.
తాజాగా కొత్త పిక్స్ ను షేర్ చేశారు. బనారస్ చీరలో అందాలు ఆరబోశారు. హెయిర్ లీవ్ చేసుకుని రకరకాల పోజులు ఇచ్చారు. సింపుల్ మేకప్ తో అందరినీ ఫ్లాట్ చేశారు. తన నవ్వు, చూపుతో మైండ్ బ్లాక్ చేశారు. సంయుక్త పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండగా.. ఫోటోలు చాలా బాగున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. లైకులు కొడుతూ షేర్ చేస్తున్నారు. సో గోర్జియస్ సంయుక్త మేడం జీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.