యంగ్ టైగర్ సినిమాలో మాలీవుడ్ హీరోలా!
మరి యంగ్ టైగర్ కోసం ఎలాంటి విలన్లను దించుతున్నాడు? అంటే ఇప్పుడు ఏకంగా హీరోల్లే విలన్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 9 Jan 2025 11:06 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇది భారీ యాక్షన్ థ్రిల్లర్. `కేజీఎఫ్`, `సలార్` రేంజ్ యాక్షన్ సినిమా. కానీ బ్యాక్ డ్రాప్ మాత్రం కొత్తగా తీసుకుంటారు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా నటీనటుల ఎంపిక పనుల్లో టీమ్ బిజీగా ఉంది.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో విలన్లు ఎలా ఉంటారో? అన్నది చెప్పాల్సిన పనిలేదు. `కేజీఎఫ్`, `సలార్` చూస్తే? ఆయనలో విలనిజం అన్నది ఎంత కర్కశంగా ఉంటుందో? అర్దమవుతుంది. రెండు సినిమాల్లోనూ హీరోలకు ధీటైన విలన్లు ఎంపిక చేసి పెట్టి కథను నడిపించాడు. సినిమా సగం సక్సెస్ క్యాస్టింగ్ ఎంపికలోనే అయిపోయింది. మరి యంగ్ టైగర్ కోసం ఎలాంటి విలన్లను దించుతున్నాడు? అంటే ఇప్పుడు ఏకంగా హీరోల్లే విలన్ చేస్తున్నారు.
బిజు మీనన్ మాలీవుడ్ లో పేరున్న హీరో. ఇతడు టాలీవుడ్ విలన్ గా సుపరిచితం. రెండు భాషల్లోనూ చాలా సినిమాలు చేసారు. తాజాగా బిజు మీనన్ ఓ విలన్ గా ఎంపిక చేస్తున్నారట. ఇందులో ఆ పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందిట. ఇక మరో విలన్ పాత్రకు మాలీవుడ్ స్టార్ హీరో టివినో థామస్ ని తీసుకుంటున్నారట. ఈ పాత్ర ఇంకా శక్తి వంతంగా ఉంటుందట. అంటే తోవినో థామస్ ...బిజుమీనన్ కుమారుడి పాత్రలో కనిపించనున్నాడట.
బిజు మీనన్ తర్వాత వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే బాధ్యతలు టివినో థామస్ తీసుకుంటాడని సమాచారం. ఇంకా కొందరు కోలీవుడ్, టాలీవుడ్ నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారట. అలాగే ఈ కథని ఒక భాగంగా తీస్తున్నారా? రెండు భాగాలుగానా? అన్నది ప్రాజెక్ట్ సెట్స్ కి వెళ్లిన తర్వాత డిసైడ్ అవుతుంది అన్నది లీకైంది. మొత్తానికి తారక్ సినిమా కూడా భారీ యాక్షన్ థ్రిల్లర్ అని మరోసారి క్లారిటీ వస్తోంది.