Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీ బంద్..హీరోలు ఈసారైనా త‌గ్గుతారా?

మాలీవుడ్ బంద్ కి పిలుపునిచ్చిందా? జూన్ 1 నుంచి షూటింగ్ స‌హా అన్ని కార్య‌క్రమాలు నిలిచిపోతున్నాయా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   9 Feb 2025 10:26 AM GMT
ఇండ‌స్ట్రీ బంద్..హీరోలు ఈసారైనా త‌గ్గుతారా?
X

మాలీవుడ్ బంద్ కి పిలుపునిచ్చిందా? జూన్ 1 నుంచి షూటింగ్ స‌హా అన్ని కార్య‌క్రమాలు నిలిచిపోతున్నాయా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం మాలీవుడ్ ప‌రిశ్ర‌మ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే? ప‌రిశ్ర‌మ మనుగ‌డే ప్ర‌శ్నార్దకం అవుతుంద‌ని ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లు శాఖ‌లు ఆందోళ వ్య‌క్తం చేస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకురావాలంటే షూటింగ్ నిలిపి వేత‌తో పాటు, సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌, ఇంకా ఇండ‌స్ట్రీకి సంబంధించిన అన్ని కార్య‌క‌లాపాలు నిలిపివేస్తే త‌ప్ప ప‌రిస్థితులు అదుపులోకి రావ‌ని చిత్ర నిర్మాత‌ల మండ‌లి, పంపిణీదారుల సంఘం, చిత్ర కార్మికుల స‌మాఖ్య‌, ఎగ్జిబిటర్ల సంఘం అన్ని క‌లిపి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ ప్ర‌క‌టించారు. సినిమా ప‌రిశ్ర‌మ 30 శాతం ప‌న్ను క‌డుతోంది.

ఇది కాకుండా వినోద‌పు ప‌న్ను అద‌నంగా క‌డుతున్నాం. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని ప‌న్ను ర‌ద్దు చేయాలి. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల పారితోషికాలు పెరిగిపోయాయి. వాటిని త‌గ్గించాలి. సినిమా బ‌డ్జెట్ లో 60 శాతం న‌టీన‌టుల పారితోషికంగా పొతుంది. దీంతో నిర్మాత‌లు ఒత్తిడికి గుర‌వుతున్నారు. కొత్త‌గా వ‌స్తోన్న న‌టీన‌టులు, డైరెక్ట‌ర్లు పారితోషికాలు ఎక్కువ‌గా డిమాండ్ చేస్తున్నారు. అందువ‌ల్లే ప‌రిశ్ర‌మ న‌ష్టాల్లో ఉంద‌ని సురేష్ కుమార్ పేర్కొన్నారు.

2024లో 176 చిత్రాలు న‌ష్టాల్ని మిగిల్చాయి. 100 కోట్లకు పైగా న‌ష్టం వచ్చింది. ఈ న‌ష్టం ఇండస్ట్రీ మీద ఆధారప‌డి బ్ర‌తికే వారిపై ప్ర‌భావాన్ని చూపిస్తుందన్నారు. మొత్తంగా సినిమా నిర్మాణం పెర‌గ‌డం ఇండ‌స్ట్రీ న‌ష్టాల‌కు దారి తీసింద‌న్న‌ది హైలైట్ అవుతుంది. ఇవ‌న్నీ అదుపులోకి రావాలంటే సినిమాకి సంబంధించిన అన్ని ర‌కాల ప‌నులు బంద్ పెడితేనే అధిక పారితోషికం తీసుకునే వారంతా దిగి వస్తార‌ని అన్ని సంఘాలు భావిస్తున్నాయి.