మలయాళ సినిమా.. ఇక నుంచి కండీషన్స్ అప్లై..!
మలయాళ సినిమా రేంజ్ ఏంటి అన్నది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో అందరికీ తెలుస్తుంది.
By: Tupaki Desk | 3 Oct 2024 3:57 AM GMTమలయాళ సినిమా రేంజ్ ఏంటి అన్నది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో అందరికీ తెలుస్తుంది. కరోనా లాక్ డౌన్ టైం లో ప్రేక్షకులంతా కూడా మలయాళ సినిమాలను బాగా చూశారు. ఆ టైం లోనే ఓటీటీలకు మంచి ఊపొచ్చింది. థియేటర్ లో కన్నా మలయాళ సినిమాలకు ఓటీటీలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. థియేట్రికల్ రిలీజ్ అయినా కాకపోయినా సరే ఓటీటీలో మాత్రం మలయాళ సినిమా సత్తా చాటుతుంది. ఐతే థియేట్రికల్ రిలీజ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలకు ఓటీటీలో తక్కువ రేటు ఇస్తున్నారన్న టాక్ ఉంది.
అంతేకాదు థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఆ బజ్ తో ఓటీటీలో ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది. ఇది నిర్మాతకు ఓ విధంగా నష్టాన్ని తెస్తుంది. రిలీజ్ ముందు ఓటీటీ రైట్స్ అమ్మడం వల్ల కూడా ఈ నష్టం జరుగుతుందని గుర్తించారు. అందుకే మలయాళ సినీ పెద్దలు ఇక మీదట సినిమాలను రిలీజ్ ముందు ఓటీటీ రైట్స్ అమ్మకూడదని ఫిక్స్ అయ్యారట. వారు చేసేది ఎలాగు మీడియం బడ్జెట్ సినిమాలే కాబట్టి ఓటీటీ లు ఇచ్చే అమౌంట్ తో పని ఉండదు.
టాలీవుడ్ లో కొన్ని సినిమాలు ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు ఐతే ముందే ఓటీటీ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకుంటున్నాయి. అందుకే సినిమాల రిలీజ్ డేట్ లు ఓటీటీలు చెప్పినప్పుడు చేయాల్సి వస్తుంది. ఆ ప్రెజర్ లేకుండా ఇంకా ఓటీటీల మీద ఎక్కువ డిమాండ్ చేసేలా మలయాళ పరిశ్రమ కొత్త కండీషన్స్ పెడుతుంది. ఇక మీదట ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజై ఆడియన్స్ సినిమాపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ ని లెక్క వేసుకుని ఓటీటీ రైట్స్ డిమాండ్ చేయాలని అనుకుంటున్నారు.
ఇదొక రకంగా పరిశ్రమ బాగు కోసం తీసుకునే నిర్ణయమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం మలయాళ సినిమా అంటే కంటెంట్ ఉన్న సినిమా అని అందరు ప్రూవ్ చేస్తున్నారు. అక్కడ నుంచి వచ్చే కథల రిఫరెన్స్ లతో చాలా సినిమాలు చేస్తున్నారు. సో ఓటీటీల ఆటకి అడ్డుకట్ట వేసేందుకు మలయాళ పరిశ్రమ మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. ఐతే ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయించిన ఈ కండీషన్ ని అందరు పాటిస్తారా లేదా అన్నది చూడాలి. యూనిటీగా ఉంటే మాత్రం ఓటీటీ సంస్థలే వారి దారిలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.