Begin typing your search above and press return to search.

మ‌ల్టీ టాస్కింగ్ లో సూప‌ర్ స్టార్లు!

న‌టించ‌డం..నిర్మించ‌డం..ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం ఇలా ఒకేసారి ఇన్ని ప‌నులు చేయ‌డం అన్న‌ది అంద‌రి వ‌ల్ల కాదు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 2:45 AM GMT
మ‌ల్టీ టాస్కింగ్ లో సూప‌ర్ స్టార్లు!
X

న‌టించ‌డం..నిర్మించ‌డం..ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం ఇలా ఒకేసారి ఇన్ని ప‌నులు చేయ‌డం అన్న‌ది అంద‌రి వ‌ల్ల కాదు. అది కొంద‌రికే సాధ్యం. అందులో మాస్ట‌ర్లు ఎవ‌రు? అంటే మాలీవుడ్ న‌టుల‌నే చెప్పాలి. అంత‌గా క‌ష్ట‌ప‌డతారు కాబ‌ట్టే మోహ‌న్ లాల్, మ‌మ్ముట్టి లాంటి సీనియ‌ర్ హీరోలు ఏడాదికి క‌నీసం ఆరు సినిమాలైనా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాగ‌లుగుతున్నారు. మోహ‌న్ లాల్ ఈ మ‌ధ్య ద‌ర్శ‌కుడిగా కూడా ఎంట్రీ ఇచ్చారు.

ఇకపై ఆయ‌న న‌టిస్తూ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌డం కూడా జ‌రుగుతుంది. దుల్కర్ స‌ల్మాన్ మాలీవుడ్కి బ్రేక్ ఇచ్చి కోలీవుడ్ , టాలీవుడ్ ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. తెలుగులో అత‌డి కి మంచి మార్కెట్ ఉండ‌టంతో ఎక్కువ‌గా ఇక్క‌డ సినిమాలు చేస్తున్నాడు. మ‌ధ్య‌లో కోలీవుడ్ ని ట‌చ్ చేస్తున్నాడు. అలాగ‌ని మాలీవుడ్ ని లైట్ తీసుకోలేదు. అక్క‌డా క‌థ‌లు వింటున్నాడు. స‌రైన క‌థ‌లు దొరికితే లాక్ చేసి పెడుతున్నాడు. అలాగే నిర్మాత‌గానూ రాణిస్తున్నాడు.

కేవ‌లం న‌ట‌న ఒక్క‌టే బాధ్యత అనుకోకుండా? న‌చ్చిన క‌థ‌ల కోసం పెట్టుబ‌డి పెడుతున్నాడు. స‌రిగ్గా ఇదే మార్గంలో టివినో థామ‌స్ కూడా క‌నిపిస్తున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాణంలో కూడా రాణిస్తున్నాడు. ఇత‌ర స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు సైతం పోషిస్తున్నాడు. హీరో అనే ఇమేజ్ ని ప‌క్క‌న బెట్టి ప‌నిచేస్తున్నాడు.

ఇక పృధ్వీరాజ్ సుకుమార‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మాలీవుడ్ లో స్టార్ హీరో. అక్క‌డ హీరోగా సినిమాలు చేస్తూనే ద‌ర్శ‌కుడిగానూ బిజీగా ఉన్నారు. తెలుగు,తమిళ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నాడు. మ‌రో సీనియ‌ర్ హీరో మ‌మ్ముట్టి కూడా అంతే బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆయ‌న ఇప్ప‌టికే నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తాన‌ని ప్రామిస్ చేసారు. ఏడాది ముగింపుక‌ల్లా ఆసంఖ్య పెరిగే అవ‌కాశం ఉండొచ్చ‌ని హిట్ ఇచ్చారు.