నీకు ఆ ఫీలింగ్స్ వస్తాయా అని అడిగాడు!
మాలీవుడ్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో లైంగిక వేధింపులకు అడ్డాగా మారిందా? అని అంతా నివ్వెర పోతున్నా రు.
By: Tupaki Desk | 27 Aug 2024 10:30 AM GMTజస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇప్పుడు మాలీవుడ్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతకాలం మౌనంగా ఉన్న బాధితులంతా ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. మాకు అన్యాయం జరిగిందంటూ! తమ బాధను వెల్లుబుచ్చుతున్నారు. అవి అరోపణలా? వాస్తవాలా? అన్నది తేల లేదిగానీ మాలీవుడ్ మాత్రం ఈ రకమైన ఆరోపణలతో దేశ వ్యాప్తంగా సంచలనమైంది. మాలీవుడ్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో లైంగిక వేధింపులకు అడ్డాగా మారిందా? అని అంతా నివ్వెర పోతున్నా రు.
రోజుకో నటి లైంగిక ఆరోపణలతో తెరపైకి వస్తోన్న ఉదంతం చూసి దేశం షాక్ అవుతోంది. మాలీవుడ్ లో ఇంత దారుణమైన కీచకులున్నారా? అంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తాజాగా ట్రాన్స్ జెండర్ ని సైతం కనికరించలేదని ఓ వార్త వెలుగులోకి వచ్చింది. మలయాళ తొలి ట్రాన్స్ జెండర్ నటి అంజలి అమీర్ నటుడు , నేషనల్ అవార్డు విన్నర్ సూరజ్ వెంజరమూడ్ పై సంచలన ఆరోపణలు చేసింది.
2018 లో మమ్ముట్టి నటించిన `పెరున్బు` సినిమాలో కీలక పాత్ర పోషించాను. అందులో సూరజ్ కూడా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు స్త్రీలలా సుఖం పొందుతారా? వాళ్లకు సంతృప్తి కలుగుతుందా? అసలు అలాంటి పీలింగ్స్ వస్తాయాని అని ముఖం మీదనే అడిగాడు. అలాంటి అనుభవాన్ని ఎప్పుడూ పేస్ చేయలేదు. నాకెంతో సిగ్గుగా అనిపించింది.
ఎలా సమాధానం చెప్పాలో అర్దం కాలేదు. ఆ సమయంలో కోపం తన్నుకొచ్చింది. లాగి పెట్టి చెంప మీద కొట్టాలనిపించింది. కానీ ఆ పనిచేయలేకపోయాను. విషయాన్ని మమ్ముట్టికి, దర్శకుడికి తెలియజేసాను. మళ్లీ ఎప్పుడూ నా ముందు అలాంటి మాటలు మాట్లాడలేదు` అని అంది.