Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ మోనాల్.. వాట్వే బ్లాస్టింగ్ లుక్!

దీంతో ఆమెకు తెలుగు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు

By:  Tupaki Desk   |   9 July 2024 4:04 AM GMT
బిగ్ బాస్ మోనాల్.. వాట్వే బ్లాస్టింగ్ లుక్!
X

బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అల్లరి నరేష్ సుడిగాడు మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ అమ్మడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కానీ సినిమాల కన్నా బిగ్ బాస్ షోతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్-4 సీజన్ లో తన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. గ్లామరస్ గా కనిపిస్తూ కుర్రాళ్ల మనసులు దోచేసింది. యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ దక్కించుకుంది ఈ బ్యూటీ.

దీంతో ఆమెకు తెలుగు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది బ్యూటీ. పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. దాంతోపాటు వరుస గుజరాతీ సినిమాల్లో నటిస్తోంది. యాక్ట్రెస్ గా రానిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది అమ్మడు. హీట్ పుట్టించే పిక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. గ్లామర్ గేట్లు ఎత్తేసి అందాలు ఆరబోస్తుంటోంది.

తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది మోనాల్. పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో ఫోటో షూట్ పోస్ట్ చేసింది. అందులో సింపుల్ మేకప్ తో మోనాల్ అదిరిపోయింది. క్రేజీ నెక్ సెట్ ఆమె అందాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా ఎద అందాలతో కవ్విస్తోంది. సిడ్నీ ఒపెరా హౌస్‌ లో ఐదో అంతర్జాతీయ గుజరాతీ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినట్లు తెలిపింది మోనాల్. ప్రస్తుతం ఆమె కొత్త పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే నయా ఫోటోల్లో మోనాల్ గజ్జర్ సూపర్బ్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందానికి పర్యాయ పదమని చెబుతున్నారు. బ్లాస్టింగ్ అందాలకు క్లీన్ బౌల్డ్ అయ్యామని అంటున్నారు. లైకులు కొడుతూ నెటిజన్లు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే అహ్మదాబాద్ కు చెందిన మోనాల్.. స్థానిక ING వైశ్యా బ్యాంకులో అవుట్‌ సోర్స్‌ లో జాబ్ చేసింది. ఆ సమయంలో తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆమె లైఫ్ టర్న్ అయింది.

2011లో రేడియో మిర్చి నిర్వహించిన మిర్చి క్వీన్ బీ అందాల పోటీలో పార్టిసిపేట్ చేసి కిరీటాన్ని దక్కించుకుంది మోనాల్. ఆ తర్వాత మిస్ గుజరాత్ అందాల పోటీలో కూడా పాల్గొంది. తన అందం, టాలెంట్ తో టైటిల్ ను కైవసం చేసుకుంది. అలా ఉద్యోగం మానేసి మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మోనాల్.. 2012లో తెలుగు సినిమాతోనే సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మళ్లీ మోనాల్ గజ్జర్.. టాలీవుడ్ లో ఎప్పుడు సందడి చేస్తుందో వేచి చూడాలి.