పూసలమ్మే అమ్మాయిని ట్రాప్‌లో వేసిన డైరెక్టర్?
అంతేకాదు తనను బొంబాయికి తీసుకెళ్లి అక్కడ నటశిక్షణాలయంలో చేర్చాడు.
By: Tupaki Desk | 18 Feb 2025 4:31 PM GMTమధ్యప్రదేశ్ ఇండోర్ కి చెందిన పూసలమ్మే అమ్మాయి మోనాలిసా భోంస్లే ఓవర్ నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. 16 ఏళ్ల మోనాలిసా ప్రయాగ్ రాజ్ - మహా కుంభమేళా సాక్షిగా బోలెడంత పాపులారిటీ తెచ్చుకుంది. ఈ టీనేజీ గాళ్‌కు అవకాశాలు కల్పిస్తామంటూ దర్శకనిర్మాతలు వెంటపడుతున్నారని కథనాలొచ్కచాయి. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాను ఆమె ఇంటికి వెళ్లి కలిసి తన సినిమాలో అవకాశం కల్పిస్తున్నానని ప్రకటించాడు. అంతేకాదు తనను బొంబాయికి తీసుకెళ్లి అక్కడ నటశిక్షణాలయంలో చేర్చాడు.
అయితే సనోజ్ మిశ్రా మోనాలిసాను మోసం చేస్తున్నాడని, పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటున్నాడని అతడి సహచరుడు, నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ తీవ్రంగా రోపించారు. మోనాలిసాను దోపిడీ చేస్తున్నాడని, ట్రాప్ చేస్తున్నాడని ఆరోపించాడు. అయితే సింగ్ ఆరోపణలను సనోజ్ తిప్పి కొట్టారు. ఈ ఆరోపణలను అతడు తీవ్రంగా ఖండించారు. మోనాలిసా వయస్సు కేవలం 16 సంవత్సరాలు అని, తన కుమార్తె వయసు ఉన్న అమ్మాయి అని అన్నారు. తన ఉద్ధేశం.. మోనాలిసా క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కాదు.. తనకు మద్దతునివ్వడం, మార్గనిర్దేశం చేయడమేనని అన్నారు.
మోనాలిసా భద్రత విషయంలో ఇలాంటి పుకార్లను నమ్మవద్దని సనోజ్ ప్రజలను కోరారు. కుంభమేళాలో తన అద్భుతమైన అందం, ఆకర్షణతో ప్రేక్షకులను ఆకర్షించిన మోనాలిసా బలవంతంగా ఇంటికి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చిందని, దీనివల్ల ఆమెకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన స్పష్టం చేశారు. మోనాలిసాపై అందరిలోను ఆసక్తి నెలకొన్నా కానీ, ఈ క్లిష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి మద్దతును ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. సనోజ్ మిశ్రా తాను తన మనస్సాక్షికి అనుగుణంగా వ్యవహరిస్తున్నానని, శ్రేయోభిలాషుల నుండి ఆశీర్వాదాలు పొందుతున్నానని అన్నారు. దేశం మొత్తం తనతో సంఘీభావంగా నిలబడి, మద్దతు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం ఆమె ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని తెలియడమేనని సనోజ్ వివరించారు. ఆమెకు సహాయం చేయడానికి తన శక్తి మేరకు తాను చేయగలిగినదంతా చేశానని, మోనాలిసా నటనలో శిక్షణ పొందుతోందని అన్నాడు.
జితేందర్ పేరును ప్రస్థావించకుండా, అతడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ప్రత్యారోపణలు చేసారు. అతడి ఆరోపణలను నిరాధారమని అన్నారు. కొందరు తనకు హాని కలిగిస్తున్నారని, తన చిత్రం 'ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్' షూటింగ్ సమయంలో తనకు కీడు తలపెట్టారని కూడా ఆరోపించారు. 'ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్' చిత్రంలో మోనాలిసాకు సనోజ్ ఒక కీలక పాత్రను ఆఫర్ చేసారు.