పూసలు అమ్మే మోనాలిసాకు షాకిచ్చే పారితోషికం
ఎట్టకేలకు మోనాలిసా భోన్‌స్లే బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశాన్ని పొందింది. దర్శకుడు సనోజ్ మిశ్రా తన చిత్రం 'ది డైరీ ఆఫ్ మణిపూర్' కోసం మోనాలిసా సంతకం చేసిందని కథనాలొస్తున్నాయి.
By: Tupaki Desk | 9 Feb 2025 9:53 AM GMTప్రయాగ్‌రాజ్- మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మోనాలిసా భోన్‌స్లే ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. 16 ఏళ్ల ఈ యువతి తేనె కళ్లతో మత్తు చల్లింది. బోయ్స్ కుంభమేళాలో తన చుట్టూ బొంగరంలా తిరిగారు. సెల్ఫీలు, ఫోటోలు అంటూ మీది మీదికొచ్చారు. మోనాలిసా ఫాలోయింగ్ కి మైండ్ బ్లాంక్ అయింది. మీడియాలు తన ఇంటి చుట్టూ వాలిపోయి ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించాయి. యూట్యూబ్ చానెళ్లకు ఇదో గేమ్ లా మారింది.
మోనాలిసా ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ ని షేక్ చేసాయి. క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన పేరు ప్రముఖంగా హెడ్ లైన్స్ లోకొచ్చింది. అదే సమయంలో మోనాలిసా పలువురు దర్శకుల దృష్టిని ఆకర్షించింది. వారు తమ సినిమాల్లో ఒక పాత్ర కోసం మోనాలిసాను ఊహించుకోవడం మొదలు పెట్టారు. దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో ఆఫర్ అంటూ ప్రచారం చేసారు కొందరు.
ఎట్టకేలకు మోనాలిసా భోన్‌స్లే బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశాన్ని పొందింది. దర్శకుడు సనోజ్ మిశ్రా తన చిత్రం 'ది డైరీ ఆఫ్ మణిపూర్' కోసం మోనాలిసా సంతకం చేసిందని కథనాలొస్తున్నాయి. తన తొలి చిత్రానికి పారితోషికం గురించి ఊహాగానాలు సాగుతున్నాయి. మోనాలిసా భోన్‌స్లే పాత్రకు రూ.21 లక్షలు ఆఫర్ చేసినట్లు కథనాలొస్తున్నాయి. అంతేకాదు.. మోనాలిసా నివశించే ఇండోర్ పరిసరాల్లో, స్థానిక వ్యాపార ప్రమోషన్ల కోసం ఏకంగా రూ.15 లక్షల ప్రత్యేక ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం.
చూస్తుండగానే, మోనాలిసా రేంజ్ స్కైని టచ్ చేస్తోంది. గతంలో పూసలు అమ్ముతూ రోజుకు రూ.1,000 సంపాదించిన మోనాలిసా భోన్‌స్లే ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తోంది. ఈ క్రేజ్ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. మోనాలిసాను అదృష్టం కుంభమేళా సాక్షిగా వరించింది. ఇప్పుడు తనను ఆరాధించేందుకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ప్రేమ పేరుతో వెంటపడే కుర్రాళ్లు కూడా అదనపు బోనస్.