Begin typing your search above and press return to search.

ఒక‌ నెల‌లో కుంభ‌మేళా మోనాలిసా సంపాద‌న 45 ల‌క్ష‌లు?

మహా కుంభమేళా 2025 ఉత్స‌వాల్లో మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన పూసల అమ్మే 16 ఏళ్ల‌ అమ్మాయి మోనాలిసా భోంస్లే ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Feb 2025 11:18 AM GMT
ఒక‌ నెల‌లో కుంభ‌మేళా మోనాలిసా సంపాద‌న 45 ల‌క్ష‌లు?
X

మహా కుంభమేళా 2025 ఉత్స‌వాల్లో మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన పూసల అమ్మే 16 ఏళ్ల‌ అమ్మాయి మోనాలిసా భోంస్లే ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఓవ‌ర్ నైట్ సెన్సేష‌న్ ఫాలోయింగ్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంతేకాదు.. మోనాలిసా కోసం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ‌ సినీద‌ర్శ‌కులు, క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల కంపెనీలు క్యూ క‌డుతున్నాయ‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

అయితే మోనాలిసా కోసం పెద్ద క్యూ ఏదీ లేదు కానీ, ఇప్ప‌టికే ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌న సినిమాలో న‌టించేందుకు సంత‌కం చేయించుకున్నాడు. దానికోసం నిర్మాత నుంచి 15ల‌క్ష‌ల వ‌ర‌కూ మోనాలిసా అందుకోబోతోంద‌ని క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు ఓ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న కోసం మోనాలిసాకు 15ల‌క్ష‌ల వ‌ర‌కూ ముట్ట‌జెప్పార‌ని, ఇది పాపుల‌ర్ జువెల‌రీ బ్రాండ్ ప్ర‌క‌ట‌న అని కూడా గుస‌గుస వినిపిస్తోంది. జువెల‌రీ కంపెనీ ఏది? అన్న‌ది ఇంకా తెలీదు కానీ ఈనెల 14 నుంచి కేర‌ళ‌లో మోనాలిసాపై షూటింగ్ స్టార్ట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అంత‌కంటే ముందు ఫిబ్ర‌వ‌రి 12న దిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద మొద‌టి షాట్ చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని కూడా వెల్ల‌డైంది.

ఈలాగే దర్శకుడు సనోజ్ మిశ్రా తన చిత్రం `ది డైరీ ఆఫ్ మణిపూర్` కోసం మోనాలిసా సంతకం చేసింద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. త‌న‌ తొలి చిత్రానికి పారితోషికం గురించి ఊహాగానాలు సాగుతున్నాయి. మోనాలిసా భోన్‌స్లే పాత్రకు 15-21 లక్షలు మ‌ధ్య ఆఫర్ చేసినట్లు క‌థ‌నాలొస్తున్నాయి. అంతేకాదు.. మోనాలిసా నివ‌శించే ఇండోర్ ప‌రిస‌రాల్లో, స్థానిక వ్యాపార ప్రమోషన్ల కోసం ఏకంగా రూ.15 లక్షల ప్రత్యేక ఒప్పందంపై సంతకం చేసినట్లు గుస‌గుస‌లు వినిపించాయి. పూసలు అమ్ముతూ రోజుకు రూ.1,000 సంపాదించిన మోనాలిసా భోన్‌స్లే ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తోంది. ఈ క్రేజ్ చూస్తుంటే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మోనాలిసాను అదృష్టం వ‌రించింది. అంత‌కుమించి త‌న‌కు భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.