Begin typing your search above and press return to search.

హాలీవుడ్ తెర మీద మంకీ మేన్.. చప్పట్లు, అరుపులతో రెస్పాన్స్..!

అయితే ఇప్పుడు ఇండియన్ సినిమాల స్థాయి పెరిగింది.

By:  Tupaki Desk   |   19 March 2024 12:50 PM GMT
హాలీవుడ్ తెర మీద మంకీ మేన్.. చప్పట్లు, అరుపులతో రెస్పాన్స్..!
X

వరల్డ్ సినిమా తన ఫేస్ మార్చుకుంది. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు చూసి ఔరా అనుకున్న మనమే ఇప్పుడు వారు ఆశ్చర్యపోయే సినిమాలు చేసే రేంజ్ కి వెళ్లాం. హాలీవుడ్ సినిమాల స్టోరీ టెల్లింగ్ అక్కడ ఉపయోగించే అడ్వాన్స్ టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అందుకే ఆ సినిమాలకు వైడ్ రేంజ్ రీచబులిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమాల స్థాయి పెరిగింది. మన సినిమాలకు కూడా హాలీవుడ్ లో గుర్తింపు వస్తుంది. అందుకే హాలీవుడ్ సినిమాలు కూడా కొత్త కథల మీద దృష్టి పెట్టారు.

ముఖ్యంగా పురాణ కథల మీద ప్రస్తుతం ప్రపంచ సినిమా దృష్టి పెట్టింది. పురాణ ఇతిహాస కథల మీద వరల్డ్ ఆడియన్స్ ఎప్పుడు ఆసక్తిగా ఉంటారు. అందుకే వాటి నేపథ్యంతో సినిమాలు చేయాలని మేకర్స్ చూస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ మేకర్స్ మహా భారతం, రామాయణ కథలను సినిమాలుగా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా హాలీవుడ్ మేకర్స్ మంకీ మేన్ అనే మూవీ చేశారు. స్లమ్‌ డాగ్ మిలీనియర్ నటుడు దేవ్ పటేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మంకీ మేన్ కథ స్పూర్తి హనుమంతుడు పురాణమే అని తెలుస్తుంది. ఈ సినిమాలో మన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ నటించింది. ఈ సినిమా రీసెంట్ గా ఆస్టిన్ ఎస్.ఎక్స్.డబల్యు లో వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించబడింది.

ఈ ప్రీమియర్ కు అందులో నటించిన శోభితకు ఆహ్వానం అందింది. సినిమా ప్రీమియర్ తర్వాత శోభిత స్పీచ్ కూడా ఇచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు అందరు చప్పట్లతో, అరుపులతో ఎంజాయ్ చేశారు. స్టాండింగ్ ఒవేషన్ కూడా చేశారు. తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు శోభిత. మంకీ మ్యాన్ లో ఒక భాగం అయినందుకు ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు అమ్మాయే అయినా కూడా మొదట బాలీవుడ్ లో రాణించిన శోభిత ఇప్పుడు తెలుగులో కూడా వరుస ప్రయోగాలతో మెప్పిస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాతో కూడా ఆమె తన సత్తా చాటుతున్నారు. రెగ్యులర్ హీరోయిన్స్ గా కమర్షియల్ సినిమాల్లో కాకుండా ఎక్స్ పెరిమెంట్ సినిమాలనే ఇష్టపడుతూ వాటినే చేస్తూ వస్తున్న శోభిత మంకీ మేన్ తో మొదలైన హాలీవుడ్ కెరీర్ దూసుకెళ్లాలని ఫిక్స్ అయ్యింది. మంకీ మేన్ రిలీజ్ తర్వాత అమ్మడికి హాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.