Begin typing your search above and press return to search.

వెంకటేష్.. అనిల్.. పెద్ద ప్లానింగే..!

ఐతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ కూడా సినిమాకు ఈ రేంజ్ బజ్ తీసుకు రావడంలో సక్సెస్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   16 Jan 2025 5:30 PM GMT
వెంకటేష్.. అనిల్.. పెద్ద ప్లానింగే..!
X

విక్టరీ వెంకటేష్ సినిమా హిట్టు పడితే ఎంత సందడిగా ఉంటుందో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆడుతున్న థియేటర్ లను చూస్తుంటే అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ సైంధవ్ తో నిరాశపరచిన వెంకటేష్ లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను అనిల్ రావిపుడి చెప్పి మరీ హిట్ కొట్టాడు. ఐతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ కూడా సినిమాకు ఈ రేంజ్ బజ్ తీసుకు రావడంలో సక్సెస్ అయ్యాయి.

వెంకటేష్ అనిల్ రావిపూడి 3 సినిమాలు తీస్తే 3 సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ మసాలా సినిమా టైం లోనే ఆయన్ను కలిశానని లేటెస్ట్ రానా ఇంటర్వ్యూలో చెప్పాడు అనిల్ రావిపుడి. పటాస్ సినిమా ను రానాతో చేయాలని అతన్ను కలిస్తే ఆ టైంలోనే వెంకటేష్ గారిని కలిశానని మసాలా సినిమాకు పనిచేశానని చెప్పి షాక్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.

అంతేకాదు ఈ ఇంటర్వ్యూలోనే వెంకటేష్ తో 7, 8 కాదు కుదిరితే 10 సినిమాలు చేస్తానని. మళ్లీ మళ్లీ ఆయనతో సినిమాలు చేయాలని ఉందని అన్నాడు అనిల్ రావిపూడి. వెంకటేష్, అనిల్ టాలీవుడ్ లో ఇది మరో సూపర్ హిట్ కాంబో అని ఫిక్స్ అవ్వొచ్చు. ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం అందులో రెండు సినిమాలు సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్నాయి.

వెంకటేష్ తో సినిమా ఎలా తీస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారో బాగా కనిపెట్టిన అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైనర్స్ తీస్తూ అదరగొట్టేస్తున్నాడు. ఈ కాంబోలో 10 సినిమాలు కాదు వరుస సినిమాలు వచ్చినా కూడా ఆదరించేలా ప్రేక్షకులు ఉన్నారు. అనిల్ తో ఇలా వరుస హిట్లు కొట్టడం వెంకటేష్ కి కూడా సూపర్ బూస్టింగ్ ఇస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం హిట్ వెంకటేష్ కి నూతన ఉత్సాహాన్ని ఇవ్వగా ఈ జోష్ నెక్స్ట్ సినిమాలకు కొనసాగించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ అంతా చూసే సినిమా కాస్త ఫన్.. ఎంటర్టైన్మెంట్.. ఎమోషన్ ఇలా ఉంటే చాలు అనుకుంటారు. అనిల్ రావిపూడి కూడా సంక్రాంతికి వస్తున్నాం తో మరోసారి అది ప్రూవ్ చేసి హిట్ కొట్టాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు క్రేజ్ మరింత ఉండటంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా వెంకటేష్ కెరీర్ లో బెస్ట్ రికార్డులు అందుకుంటుంది.