Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీవీ షో ఏది?

క‌చ్ఛితంగా అది సంచ‌ల‌నాల 'ది లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్' ఫ్రాంఛైజీతో ముడిప‌డిన టీవీ షో.

By:  Tupaki Desk   |   24 Oct 2024 2:00 PM GMT
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీవీ షో ఏది?
X

ప్ర‌పంచ చరిత్రలో అత్యంత ఖరీదైన టీవీ షో ఏది? ఏకంగా బిలియ‌న్ డాల‌ర్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఏకైక టెలివిజ‌న్ షో ఏది? ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇక్క‌డ ఉంది. క‌చ్ఛితంగా అది సంచ‌ల‌నాల 'ది లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్' ఫ్రాంఛైజీతో ముడిప‌డిన టీవీ షో.

ప్ర‌పంచ చరిత్రలో అత్యంత ఖరీదైన టీవీ షో.. ఈ షోలో ప్రతి ఎపిసోడ్‌కు దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌ను ఖ‌ర్చు చేసారంటే అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చిత్రాలను కూడా మరుగుజ్జుగా మార్చేసిన ఘ‌న‌త ఇప్పుడు ఒక టీవీ షోకి ద‌క్కుతుంది. 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ ప‌వర్' చరిత్రలో అత్యంత ఖరీదైన టీవీ షో. ఈ షో మొదటి సీజన్ 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శిత‌మైంది. ప్ర‌ఖ్యాత‌ డెడ్‌లైన్ క‌థ‌నం ప్రకారం.. అమెజాన్ స్టూడియో 1 బిలియన్ (రూ.8,300 కోట్లు) డాల‌ర్ ఖర్చు చేసి ఈ టీవీ షోని నిర్మించింది. సీజన్ 1కి సంబంధించిన హక్కుల కొనుగోలు, ప్రమోషన్‌లు ఖర్చుతో కూడుకున్నవి. కేవలం ఉత్పత్తి వ్యయం 465 మిలియన్ల డాల‌ర్ల‌ (రూ.3,800 కోట్లకు పైగా)కు పైగా ఉందని కొలైడర్ క‌థ‌నం వెలువ‌రించింది. ఎనిమిది ఎపిసోడ్‌ల సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు 58 మిలియన్ల డాల‌ర్లు (రూ.480 కోట్లు) ఖర్చయింది. చాలా పెద్ద హాలీవుడ్ చిత్రాల కంటే `రింగ్స్ ఆఫ్ పవర్` ఖ‌ర్చుకు సంబంధించిన గ్రాఫ్ ట‌వ‌ర్‌లా క‌నిపిస్తోంది.

నిజానికి ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రం `స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్`. దీని నిర్మాణ బడ్జెట్ 447 మిలియన్ డాల‌ర్లు ఖ‌ర్చ‌యింది... ఇది రింగ్స్ ఆఫ్ పవర్ బ‌డ్జెట్ కంటే తక్కువ. అసలు `లార్డ్ ఆఫ్ ది రింగ్స్` ఫ్రాంఛైజీలో మూడు చిత్రాల నిర్మాణ వ్యయం కేవలం 260 మిలియన్ ల డాల‌ర్లు. స్పిన్‌ఆఫ్ షోని వీటితో పోల్చితే చాలా ముందుకు సాగింది.

టెలివిజన్ చాలా కాలంగా పేదల బాంధ‌విగా పేరుబ‌డింది. అంద‌రికీ అందుబాటులో ఉండేది టీవీ. నేటికీ థియేట‌ర్ల‌కు వెళ్ల‌కుండా టీవీనే ప్ర‌ధాన వినోదంగా భావించేవారు అధిక సంఖ్య‌లో ఉన్నారు. అయితే టీవీ స్క్రీన్ చిన్నది కాబట్టి, బ‌డ్జెట్ స్కేల్ కూడా ప‌రిమితంగానే ఉండాలి. కానీ ఇది అందుకు భిన్న‌మైన‌ది. భారతదేశంలో లేదా పాశ్చాత్య దేశాల్లో కూడా భారీ బడ్జెట్ చిత్రాలు ఈ టీవీ షోతో పోల్చితే పాలిపోయాయి. ఇటీవ‌ల ట్రెండ్ మారింది. థియేట‌ర్ షోల‌కు ధీటుగా టీవీ - ఓటీటీ సినిమాల బ‌డ్జెట్లు అసాధార‌ణంగా పెరిగాయి. పెద్ద కాన్వాస్‌లతో ఓటీటీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడంతో సీన్ అంతా మారిపోయింది.